777 Charlie Collections: తెలుగు రాష్ట్రాల్లో ప్లాప్ గా మిగిలిన ‘777 చార్లీ’..!

రష్మిక మాజీ ప్రియుడు మరియు కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన రక్షిత్ శెట్టి ‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. అతని నుండీ వచ్చిన రీసెంట్ మూవీ ‘777 చార్లీ’. ఓ లాబ్రడార్ డాగ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం ట్రైలర్ తోనే విశేషమైన అంచనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా జంతు ప్రేమికులు ఈ చిత్రం కోసం ఎప్పట్నుండో వెయిట్ చేస్తున్నారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను మరియు తోబుట్టువుని రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకుని..

ఒంటరిగా పెరుగుతూ వచ్చిన ఓ కుర్రాడికి చార్లీ (లాబ్రడార్ డాగ్) దగ్గరవ్వడం ఆ తర్వాత అతని జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ప్రధాన అంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. కిరణ్ రాజ్ కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి.ఎస్.గుప్తా, రక్షిత్ శెట్టి లు కలిసి నిర్మించారు. తెలుగు డీసెంట్ టాక్ సంపాదించుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.43 cr
సీడెడ్ 0.06 cr
ఉత్తరాంధ్ర 0.11 cr
ఈస్ట్ 0.04 cr
వెస్ట్ 0.03 cr
గుంటూరు 0.03 cr
కృష్ణా 0.05 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.78 cr

తెలుగు రాష్ట్రాల్లో ‘777 చార్లీ’ చిత్రానికి రూ.1.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.1.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఈ మూవీ కేవలం రూ.0.78 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం వీక్ డేస్ లో కంప్లీట్ గా స్లీపేసింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్లాప్ గా మిగిలింది అని చెప్పాలి. కాస్త ప్రమోషన్ చేసి రిలీజ్ చేసుంటే కనుక కచ్చితంగా ఈ మూవీ మంచి ఫలితాన్ని అందుకునేది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus