ఎనిమిదేళ్ల ‘టెంపర్’ గురించి ఆసక్తికర వివరాలు..

  • February 13, 2023 / 06:12 PM IST

‘టెంపర్’.. యంగ్ టైగర్ ఎన్టఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌‌లో వచ్చిన రెండో సినిమా.. 2004 జనవరి 1న వీరి కాంబోలో ఫస్ట్ ఫిలిం ‘ఆంధ్రావాలా’ వచ్చింది. భారీ హైప్‌తో రిలీజ్ అయ్యి.. డిజాస్టర్ అయింది.. దీంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడ్డారు.. అంతకుముందు ‘ఇద్దరమ్మాయిలతో’, ‘లోఫర్’, ‘హార్ట్ ఎటాక్’ వంటి ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టాడు పూరి.. ఇక తారక్.. ‘రామయ్యా వస్తావయ్యా’, ‘రభస’ లాంటి డిజాస్టర్లతో డీలా పడ్డాడు.. 2015 ఫిబ్రవరి 13న భారీగా విడుదలైంది.. మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. 2023 ఫిబ్రవరి 13 నాటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ‘టెంపర్’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..

ఫస్ట్ టైం వేరే కథతో పూరి చేసిన సినిమా..

తన సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే తానే రాసుకుని డైరెక్షన్ చేస్తుంటాడు పూరి.. ‘ఆంధ్రావాలా’ కు మాత్రం కోన వెంకట్ డైలాగ్స్ రాశాడు. ‘టెంపర్’ కథ.. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ రాసుకున్నాడు. పూరికి స్టోరీ వినిపించగానే.. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే అనేశారట.. ఎంతో ఎగ్జైట్ అయిపోయి.. కథకు కోటి రూపాయల చెక్కు అందించాడట. ఇక తారక్ కూడా కథ విని ఇంప్రెస్ అవడంతో షూటింగ్ స్టార్ట్ చేసేశారు.

తారక్ నటనకు ఫిదా..

ఈ జనరేషన్ హీరోల్లో యంగ్ టైగర్ ఆల్ రౌండర్ అని కొత్తగా చెప్పక్కర్లేదు.. ఇందులోనూ వన్ మెన్ షోగా సినిమాను నడిపించాడు.. ముఖ్యంగా కోర్ట్ సీన్లలో పలికించిన ఎమోషన్స్ అయితే అద్భుతం.. డ్యాన్స్ అయితే ఎప్పటిలానే ఎనర్జీతో కుమ్మేశాడు. అలాగే ఫస్ట్ టైం షర్ట్ లేకుండా.. సిక్స్ ప్యాక్‌తో కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు. ఒక రకంగా ‘టెంపర్’ తనకు మెమరబులు మూవీ.. ఎందుకంటే అప్పటి నుండి అన్నీ సూపర్ హిట్సే.. 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

బ్యాక్‌బోన్‌లా నిలిచిన నటీనటులు – సాంకేతిక నిపుణులు..

దయగా తారక్, తనకు జోడీగా కాజల్.. వాల్తేరు వాసుగా ప్రకాష్ రాజ్, మూర్తి అనే సిన్సియర్ కానిస్టేబుల్‌గా పోసాని నటన అదిరిపోతుంది. ముందుగా ఈ పాత్ర కోసం ఆర్.నారాయణ మూర్తిని అనుకున్నాడు పూరి. మిగతా నటీనటులంతా కూడా క్యారెక్టర్లకు న్యాయం చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి ‘ఇట్టాగే రెచ్చి పోదాం’ అనే ఐటెమ్ సాంగ్‌లో ప్రకాష్ రాజ్ స్టెప్పులేసి అలరించాడు.

ఇక అనూప్ రూబెన్స్ సాంగ్స్ ప్లస్ అయ్యాయి.. అలాగే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి.. శ్యామ్ కె.నాయుడు కెమెరా, ఎస్.ఆర్.శేఖర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సూపర్ హిట్ టాక్, హయ్యెస్ట్ కలెక్షన్లతో బాక్సాఫీస్ బరిలో సత్తా చాటింది ‘టెంపర్’..


అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus