సినిమా ఇండస్ట్రీలో 80ల కాలం నాటి తారల పంథా ప్రత్యేకం అని చెప్పాలి. ఏటా ఓ రోజు అనుకుని రీ యూనియన్లు ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో స్నేహం గురించి చెప్పకనే చెబుతుంటారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం ఇండస్ట్రీలకు చెందిన 80ల కాలం నాటి హీరోలు, హీరోయిన్లు (కొందరు హీరోలుగానే ఉన్నా, ఇంకొందరు ఇప్పుడు నటులుగా కన్వర్ట్ అయ్యారు అనుకోండి) కలుస్తుంటారు. ఓ కలర్ – కాన్సెప్ట్ అనుకొని రోజంతా సందడి చేసి, ఆ తర్వాత ఆ ఫొటోను మీడియా/ సోషల్ మీడియాకు ఇస్తూ ఉంటారు.
తాజాగా ఆ టీమ్ మరోసారి కలిశారు. ఈసారి ఈ వేడుకకు ముంబయిని వేదికగా ఎంచుకున్నారు. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, పూనమ్ థిల్లాన్ ఈ ఏడాది రీయూనియన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మొత్తంగా 25 మందికిపైగా నటులు హాజరయ్యారని సమాచారం. మొత్తంగా వీరికి ఇది 11వ రీయూనియన్ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దశబ్దాల నాటి స్నేహాన్ని, నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ రీయూనియన్‌ను కూడా ఎంజాయ్ చేశారట.
రీయూనియన్‌ను ముంబయిలో ఏర్పాటు చేయడంతో అక్కడి సంప్రదాయాలు, రుచులతో సందడిగా సాగిందట. ముచ్చట్లు, రుచులు, వంటలు, డ్యాన్స్‌లు, నవ్వులు.. ఇలా అందరూ హ్యాపీగా గడిపినట్లు సమాచారం. పూనమ్ ధిల్లాన్ ఈ వేడుక కోసం ప్రత్యేకంగా సరదా గేమ్‌లు, క్విజ్ పోటీలు ఏర్పాటు చేశారట. ఈ వేడుకకు సౌత్ నుండి చిరంజీవి, వెంకటేశ్, శరత్ కుమార్, భాగ్యరాజ, భానుంచదర్, నరేశ్, రాధ, అర్జున్, సుహాసిని, కుష్బూ, రమ్యకృష్ణ, నదియ, పూర్ణిమ, లిజీ, రేవతి, సుమలత తదితరులు హాజరయ్యారు.
బాలీవుడ్ నుండి అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, రాజ్ బబ్బర్, మీనాక్షి శేషాద్రి, టీనా అంబానీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాఇ అందరూ వెండి, నారింజ రంగుల్లో ఫ్యాన్సీ డ్రెస్సులతో రీయూనియన్‌కు వచ్చారు. 80ల నాటి తారలంతా ఏటా రీయూనియన్ జరుపుకోవాలనే కాన్సెప్ట్‌ను సుహాసిని మొదలుపెట్టారు. 2009 నుండి ఈ వేడుక వరుసగా నిర్వహిస్తున్నారు. 2019లో చిరంజీవి తన ఇంట్లో వేడుక నిర్వహించారు. ఆ తర్వాత కరోనా కారణంగా జరగలేదు. ఇప్పుడు ముంబయిలో నిర్వహించారు.
1
2
3
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!