కేవలం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ లతో పాటు దేశవిదేశాల్లో ఉన్న ప్రేక్షకులు కూడా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం అప్డేట్స్ కోసమే ఎక్కువగా ఎదురుచూస్తుంటారు. రాంచరణ్ పుట్టినరోజు నాడు ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్ ను విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ కూడా హైలెట్ గా నిలిచింది. ఆ తరువాత.. కరోనా వల్ల లాక్ డౌన్ రావడంతో ఎన్టీఆర్ ‘భీమ్’ టీజర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున విడుదల కాలేదు. దానికోసం 6నెలల వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు అక్టోబర్ 22న దసరా కానుకగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ విడుదలయ్యింది. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది.
అయితే ఈ రెండు టీజర్స్ లోనూ కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) మోషన్ పోస్టర్ ను విడుదల చేసినప్పుడు అల్లూరి(చరణ్) పాత్రను నిప్పుతో..అలాగే భీమ్(ఎన్టీఆర్) పాత్రను నీటితో పరిచయం చేసాడు దర్శకుడు రాజమౌళి. ఈ టీజర్లలో కూడా అదే ఫాలో అయ్యాడు మన జక్కన్న. ముఖ్యంగా ఈ రెండు ఫ్రేమ్స్ కనుక మనం గమనించినట్లయితే ఇద్దరిలోనూ ఒకే రకమైన ఎమోషన్ కనిపిస్తుంది. ఒకే సందర్భంలో ఇద్దరినీ ఆవేశానికి గురిచేసిన సంఘటన ఏదో జరిగినట్టు స్పష్టమవుతుంది.
2)ఇక ఈ రెండో విజువల్స్ కనుక మనం గమించినట్లైతే.. రామరాజు, భీమ్ ల ఆయుధాలు ఏంటన్నవి చూపించారు.
3) రెండు టీజర్లలోనూ.. రామరాజు, కొమరం భీమ్ ల ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండబోతుందో చూపించారు.
4) ఈ రెండిటిలోనూ హీరోలిద్దరి లెగ్ షాట్స్ ను కూడా చూపించారు.
5) ఇద్దరి హీరోల ఐ షాట్ చూపించడం 5వ కామన్ పాయింట్ .. అలాగే అది హైలెట్ అని కూడా చెప్పుకోవచ్చు.
6) ఇక రామరాజు టీజర్లో సూర్యుడికి నమస్కారం చేసే షాట్ ఒకటి ఉంది.. అలాగే భీమ్ టీజర్లో ఉప్పెనకు ఎదురుగా నిలబడి ఉన్న ఒక షాట్ ఉంది. బహుశా ఇవి హీరోల ఇంట్రడక్షన్ సీన్లు అయ్యుండొచ్చు.
7)ఇక మరో కామన్ పాయింట్.. భీమ్ చేతిలో జల్ జంగల్ జమీన్ అనే జెండా ఉంటే.. రామరాజు చేతిలో తుపాకీ ఉండడాన్ని మనం గమనించవచ్చు.
8) మరో షాట్లో ఇద్దరి హీరోల బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ ను ఫోకస్ చేశారు.
9) ‘రామరాజు’ టీజర్లో దర్శకుడు రాజమౌళి పేరు నిప్పుతో.. అలాగే ‘భీమ్’ టీజర్లో రాజమౌళి పేరు నీటితో పడటం మనం గమనించవచ్చు.
10) ఇద్దరి మెడలోనూ రెండు రకాల లాకెట్ లు ఉండడాన్ని కూడా ఓ కామన్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.