‘బిగ్ బాస్’ కి తెలుగు నాట మంచి క్రేజ్ నెలకొంది. నార్త్ లో సూపర్ హిట్ అయిన ఈ రియాలిటీ షో.. సౌత్ లో క్లిక్ అవుతుంది అని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఊహించని విధంగా క్లిక్ అయ్యింది. 8 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిశాయి. 9 వ సీజన్ కి కూడా రంగం సిద్ధమైంది. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేయడం వల్ల… దీనికి బాగా ప్రమోషన్ జరిగినట్లు అయ్యింది. సెకండ్ సీజన్ ను నాని హోస్ట్ చేశాడు. అయితే మూడో సీజన్ నుండి 8వ సీజన్ వరకు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు.
నాగార్జున తప్ప తెలుగు బిగ్ బాస్ కి సెట్ అయ్యే స్టార్ దొరకడం లేదు అనేది వాస్తవం. 9వ సీజన్ నుండి ఆయన తప్పుకోవాలని చూసినా… బిగ్ బాస్ నిర్వాహకులు కన్విన్స్ చేయడంతో నాగార్జున ఈ సీజన్ ను కూడా హోస్ట్ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇక 9వ సీజన్ లో కొత్త కొత్త టాస్కులు, మైండ్ గేమ్స్ తో కంటెస్టెంట్స్ కి సవాల్ విసరబోతున్నట్టు తెలుస్తుంది.
ఒకప్పటి హీరోలు, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు, యూట్యూబ్ సెలబ్రిటీలు,సోషల్ మీడియా సెలబ్రిటీలు,సినిమాల్లో వివిధ టెక్నికల్ రంగాల్లో పనిచేసిన మేకర్స్ ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేయనున్నారట. ఆల్రెడీ 9 మంది కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం… ఈసారి ‘బిగ్ బాస్’ హౌస్ లోకి అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతుందట.
తర్వాత ‘జబర్దస్త్’ కమెడియన్ ఇమాన్యుల్, సీనియర్ హీరో కమ్ ఇప్పటి సీరియల్ నటుడు సాయి కిరణ్, ముఖేష్ గౌడ, అలాగే స్టార్ ప్రొడ్యూసర్ యం.యస్.రాజు తనయుడు, హీరో అయినటువంటి సుమంత్ అశ్విన్, అలాగే నటుడు శివ కుమార్, తేజస్విని, నవ్య స్వామి,రీతు చౌదరి వంటి వారు హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. వీళ్ళయితే దాదాపు ఫిక్స్ అంటున్నారు. మరి మిగిలిన 8 మంది కంటెస్టెంట్స్ ఎవరు? అనేది కూడా తెలియాల్సి ఉంది. కామన్ మెన్ క్యాటగిరిలో కూడా కొత్త వారికి అవకాశం ఉందట.