Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ‘సాహసం శ్వాసగా సాగిపో’ చూసేందుకు 9 కారణాలు

‘సాహసం శ్వాసగా సాగిపో’ చూసేందుకు 9 కారణాలు

  • November 14, 2016 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సాహసం శ్వాసగా సాగిపో’ చూసేందుకు 9 కారణాలు

విభిన్న చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఇందులో యువ సామ్రాట్ నాగచైతన్య, మలయాళ నటి మంజిమ మోహన్ జంటగా నటించారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా యువతకు నచ్చడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన 9 కారణాలు చూద్దాం.

1 . గ్రేట్ కాంబినేషన్ Sahasam Swasaga Sagipoగౌతమ్ మీనన్, నాగచైతన్య కాంబినేషన్లో తొలి సారి ఏ మాయ చేసావే సినిమా వచ్చింది. 2010 లో విడుదలైన ఈ చిత్రం యువతను కట్టిపడేసింది. వారిద్దరి కలయికలో ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ‘సాహసం శ్వాసగా సాగిపో’ మూవీ రూపుదిద్దుకుంది. దీంతో ఈ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల అంచనాలకు మించి డైరక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని కైవసం చేసుకున్నారు.

2 . రెహమాన్ మ్యూజిక్ Sahasam Swasaga Sagipoఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’కి ఎప్పటిలాగే అద్భుతమైన పాటలను ఇచ్చారు. ఈ చిత్రానికి రెహమాన్ పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన బలం.

3 . చైతూ మెస్మరైజింగ్ యాక్టింగ్ Sahasam Swasaga Sagipoగత నెలలో విడుదలయిన ప్రేమమ్ మూవీ లో నాగ చైతన్య అద్భుత నటన ప్రదర్శించారు. లవర్ బాయ్ గా ఆకట్టుకున్నారు. ‘సాహసం శ్వాసగా సాగిపో” లో చైతూ తన నటనతో మెస్మరైజ్ చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన ఎమోషన్స్ ని చక్కగా పలికించారు.

4 . వెళ్లిపోమాకే… పాట హైలెట్ Sahasam Swasaga Sagipo‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా చూస్తున్నంతసేపు మనల్ని వెంటాడే పాట వెళ్లిపోమాకే. అంతగా నచ్చడానికి … ఈ పాట వచ్చిన సందర్భం ఇది వరకు ఏ చిత్రంలో రాకపోవడం ఒక కారణం అయితే, చిత్రీకరణ మరో కారణం. సరికొత్త టేకింగ్ తో వెళ్లిపోమాకే… ఇంటికి వెళ్లినా వెళ్లిపోదు.

5 . షేడ్స్ ఉన్న క్యారక్టర్ Sahasam Swasaga Sagipoనాగ చైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ లో మెచ్యూర్డ్ నటన కనబరిచారు. మొదటి సగభాగం మొత్తం లవర్ బాయ్ గా నటించి.. వెంటనే తనకు తాను ఒక యాంగ్రీ యాంగ్ మ్యాన్ గా మార్చుకునే విధానంలో చైతూ చాలా కష్టపడ్డారు. ఆకష్టమే ప్రేక్షకులను కుర్చీల నుంచి కదలనివ్వడం లేదు.

6 . మంజిమ నటనకు ఫిదా Sahasam Swasaga Sagipoమలయాళంలో పది చిత్రాల్లో మెప్పించిన మంజిమ మోహన్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ ద్వారా తెలుగులో అడుగుపెట్టారు. ఈ చిత్రం ట్రైలర్ చూసినప్పుడు “లావుగా ఉంది .. ఈమె హీరోయిన్నా” అని పెదవి విరిచిన వాళ్లంతా సినిమా చూస్తున్నపుడు ఆ విషయాన్నే మరిచిపోయారు. మంజిమ నటనకు ఫిదా అయిపోయారు.

7 . ఊహించని మలుపులు Sahasam Swasaga Sagipoరొటీన్ లవ్ స్టోరీని గౌతమ్ మీనన్ కొత్తగా, కన్వీనెన్స్ గా చెప్పడంలో సక్సస్ అయ్యారు. ఈ చిత్రంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఎవరూ ఉహించని విధంగా స్క్రీన్ ప్లే రాసుకొని హిట్ కొట్టారు.

8 . రెండింటి కలబోత Sahasam Swasaga Sagipoఏ సినిమాకు అయినా జానర్ ఒకటే ఉంటుంది. లవ్, యాక్షన్, హారర్, థ్రిల్లర్ ఇలా.. ఒక జానర్ లో కథ నడుస్తుంటుంది. కానీ డైరక్టర్ లవ్ జానర్ నుంచి యాక్షన్ థ్రిల్లర్ లా కథను ట్రాన్స ఫర్మేషన్ చేసి పెద్ద సాహసమే చేశారు. పాటలన్నీ ఫస్ట్ హాఫ్ లో పెట్టి, సెకండాఫ్ లో కథను ఉత్కంఠ భరితంగా తీసుకెళ్లారు. ఈ విధానం యువతకు భలే నచ్చింది.

9 . చివరి ట్విస్ట్ సూపర్ Sahasam Swasaga Sagipoఈ చిత్రంలో నాగ చైతన్య ప్రేక్షకులకు చివరి వరకు తన పేరు చెప్పరు. క్లైమాక్స్ లో వెల్లడిస్తారు. ఇదొక స్పెషల్ అయితే.. లాస్ట్ సీన్లో రివీల్ అయ్యే ట్విస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చిత్రాన్ని మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఆసక్తికరంగా తెరకెక్కించి గౌతమ్ మీనన్ మరోసారి మ్యాజిక్ చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #9 Reasons To Watch Sahasam Swasaga Sagipo
  • #A.R.Rahman
  • #Gautham Menon
  • #Manjima Mohan
  • #naga chaitanya

Also Read

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Manam Movie: రీరిలీజ్‌కి సిద్ధమైన అక్కినేని ‘మనం’.. వారికి మాత్రమే అందుబాటులోకి..

Gharshana: 21 ఏళ్ళ ‘ఘర్షణ’ .. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gharshana: 21 ఏళ్ళ ‘ఘర్షణ’ .. టోటల్ కలెక్షన్స్ ఇవే

Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

Thandel: బుల్లితెరపై కూడా అదరగొట్టిన సాయి పల్లవి ‘తండేల్’

Thandel: బుల్లితెరపై కూడా అదరగొట్టిన సాయి పల్లవి ‘తండేల్’

Naga Chaitanya: మళ్ళీ తమిళ దర్శకుడితో నాగ చైతన్య సినిమా?

Naga Chaitanya: మళ్ళీ తమిళ దర్శకుడితో నాగ చైతన్య సినిమా?

trending news

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు!

4 hours ago
Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

5 hours ago
Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

6 hours ago
This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

6 hours ago
Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

1 day ago

latest news

Tollywood: ఫిల్మ్‌ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆగ్రహం.. సినిమాల పరిస్థితేంటి?

Tollywood: ఫిల్మ్‌ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆగ్రహం.. సినిమాల పరిస్థితేంటి?

4 hours ago
Coolie Badge: రజనీకాంత్‌ చేతిలో కనిపించే బ్యాడ్జీ వెనక ఎమోషనల్ స్టోరీ.. ఏంటో తెలుసా?

Coolie Badge: రజనీకాంత్‌ చేతిలో కనిపించే బ్యాడ్జీ వెనక ఎమోషనల్ స్టోరీ.. ఏంటో తెలుసా?

7 hours ago
Ajith: నన్ను అవమానించారు.. ఎన్నో పరీక్షలు పెట్టారు.. అజిత్‌ ఇంకా ఏం చెప్పాడంటే?

Ajith: నన్ను అవమానించారు.. ఎన్నో పరీక్షలు పెట్టారు.. అజిత్‌ ఇంకా ఏం చెప్పాడంటే?

11 hours ago
Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

1 day ago
Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version