అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) క్లాస్ సినిమాలు చేసిన ప్రతిసారి సక్సెస్ దక్కింది. కానీ మాస్ హీరో అవ్వాలని చాలా సార్లు గట్టి ప్రయత్నాలే చేశాడు. అయినా ఎందుకో అది వర్కౌట్ కాలేదు. క్లాస్ సినిమాలు ఎన్ని చేసినా ఎదురుదెబ్బలు ఎక్కువ తగిలింది లేదు. కానీ మాస్ సినిమా ఎంత టాలెంటెడ్ డైరెక్టర్ తో చేసినా.. మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. అయితే ఓసారి ఆ అవకాశం దగ్గర వరకు వచ్చి మాయమైపోయినట్టు అయ్యింది.
విషయంలోకి వెళితే.. ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) వంటి యావరేజ్ సినిమా తర్వాత నాగ చైతన్య ‘దోచేయ్’ (Dohchay) అనే సినిమా చేశాడు. ఇండస్ట్రీలో అతన్ని ‘చేయ్’ అని పిలుస్తారు కాబట్టి.. అది కూడా కలిసొచ్చేలా టైటిల్ ‘దోచేయ్’ అని పెట్టారు. ‘స్వామిరారా’ (Swamy Ra Ra) తో హిట్ కొట్టిన దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘అత్తారింటికి దారేది’ (Attarintiki Daredi) వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) నిర్మించిన సినిమా ఇది.
మొదటి షోతోనే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. చైతన్య పెర్ఫార్మన్స్, కామెడీ, క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. టెక్నికల్ గా కూడా చాలా రిచ్ గా, క్వాలిటీగా ఉంటుంది. మ్యూజిక్ కూడా కొత్తగా ఉంటుంది. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. కానీ ఎందుకో ఈ సినిమా ఆడలేదు.
రూ.13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సగం కూడా రికవరీ చేయలేకపోయింది. హిట్ టాక్ వచ్చి కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అందుకే ఈరోజు ఈ సినిమా హాట్ టాపిక్ అయ్యింది అని చెప్పొచ్చు.