దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ పలు అవకాశాలను అందుకని దూసుకుపోతున్న నటి పూజా హెగ్డే తాజాగా 75వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ చిత్రోత్సవాలలో భాగంగా ప్రస్తుతం ఫ్రాన్స్ లో పూజా హెగ్డే సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా రెట్ కార్పెట్ పై నడిచే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం వేసింది.
ఈ క్రమంలోనే అక్కడ తనను మరింత ఎంతో అందంగా చూపించాలని తన టీమ్ మొత్తం ఎన్నో రకాల వస్తువులను మేకప్ ప్రొడక్ట్స్ అన్ని సిద్ధంగా చేసి పెట్టారు. ఇక ఫ్రాన్స్ బయలుదేరేముందు ఇండియా ఎయిర్పోర్టులో బ్యాగ్స్ మొత్తం చెకిన్ అయ్యాయి. తీరా ఫ్యాన్స్ లో దిగిన తర్వాత బ్యాగులు ఫ్రాన్స్ రాలేదని తెలియడంతో ఒక్కసారిగా ఆందోళనలో పడ్డామని పూజా హెగ్డే వెల్లడించారు.కేన్స్ ఫెస్టివల్ లో మెరవాలనే కోరిక సాకారమవుతున్న వేళ ఇలా బ్యాగ్స్ మిస్ కావడంతో ఎంతో ఆందోళన చెందాము.
నేను నా టీం మొత్తం తినడం కూడా మానేసి ఆందోళన పడ్డామని పూజా హెగ్డే వెల్లడించారు. బట్టలు, హెయిర్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని పోయాయి. అదృష్టం కొద్దీ ఇండియాలో కొన్న కొన్ని బంగారు నగలు నా హ్యాండ్ బ్యాగ్ లో నా దగ్గరే ఉన్నాయి. దాంతో ఊపిరిపీల్చుకున్నానని ఈమె తెలియజేశారు.
సమయంలో నా మేనేజర్ నా టీం మొత్తం కంగారు పడటం చూసి ఆందోళన చెందకండి అని చెప్పి మనకు కొంత సమయం దొరికింది వెంటనే వెళ్లి బట్టలు బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని కొనమని వాళ్లకు చెప్పాను. ఇలా అందరూ ఏ ఏ వస్తువులు అవసరం అవుతాయో వాటిని కొని తీసుకువచ్చి రెడ్ కార్పెట్ పై నడిచిన అనంతరం రాత్రికి అందరం కలిసి భోజనం చేశామని ఈ సందర్భంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తను పడిన ఇబ్బందులను పూజా హెగ్డే వెల్లడించారు.