నితిన్ (Nithiin) , శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమా డిసెంబర్ 25 కి విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని పోస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మేకర్స్ చెప్పారు. ఇదొక అడ్వెంచరస్ డ్రామా అని ఎప్పుడు వచ్చినా.. ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడం ఖాయమని మేకర్స్ చెప్పడం జరిగింది. అయితే అసలు కారణాలు ఏంటన్నది చెప్పలేదు. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘రాబిన్ హుడ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అవ్వలేదు.
మరోపక్క ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) రన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అది కూడా ‘మైత్రి’ వారి సినిమానే! సో ఈ సినిమాని కూడా రిలీజ్ చేస్తే.. ఒక సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. ఎక్కువగా ‘రాబిన్ హుడ్’ పెర్ఫార్మన్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమవుతుంది. అయితే ‘రాబిన్ హుడ్’ ని నెక్స్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో స్పష్టత లేదు.
సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు. నిర్మాతలైతే ట్రై చేశారు కానీ.. ఆశించిన థియేటర్లు దక్కడం లేదు అని.. లైట్ తీసుకున్నారట. మరోపక్క శివరాత్రి పండుగ టైంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్టు టాక్ నడుస్తుంది. కానీ ఆ టైంకి ‘తమ్ముడు’ (Thammudu) సినిమాని అనౌన్స్ చేశారు. అది కూడా నితిన్ హీరోగా రూపొందిన సినిమానే.
వేరే సినిమాలని ఇబ్బంది పెట్టకుండా ఆ సినిమాని శివరాత్రికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దిల్ రాజు (Dil Raju) రెడీ అయ్యారు. ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ కనుక ఆ టైంకి వస్తుందని మేకర్స్ ప్రకటిస్తే ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ ఇరకాటంలో పడుతుంది. పైగా దిల్ రాజు, ‘మైత్రి’..ల కి పెద్దగా పడదు అనే టాక్ కూడా ఉంది. మరి ఈ సినిమాల విషయంలో ఏం జరుగుతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.