రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘విరాటపర్వం’. దర్శకుడు వేణు ఊడుగుల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక గొప్ప సినిమాను చూడబోతున్నామనే ఫీలింగ్ ని కలిగించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా యూత్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందనే సందేహాలు కలుగుతున్నాయి. నక్సలిజం కాన్సెప్ట్ తో ఒకప్పుడు చాలా సినిమాలు వచ్చాయి. ‘సింధూరం’, ‘శ్రీరాములయ్య’ లాంటి సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను కదిలించాయి.
కానీ కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ కాలేదు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేది. తరచూ దాని గురించి చర్చలు జరిగేవి. మీడియాలో కూడా నక్సలిజంకి సంబంధించి రోజూ వార్తలు వచ్చేవి. దీంతో అప్పట్లో నక్సలిజం నేపథ్యంలో ఎక్కువగా సినిమాలు తీసేవారు. అవి ఎంత సక్సెస్ అయ్యాయనే విషయాన్ని పక్కన పెడితే.. జనాలు బాగా రిలేట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గత పది, పదిహేనేళ్లుగా నక్సలిజం ప్రభావం బాగా తగ్గింది.
జనాల్లో పెద్దగా చర్చలు కూడా జరగడం లేదు. ఇలాంటి సమయంలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సీరియస్ కథను చెబితే ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ కాలం యువత ఎంతవరకు రిలేట్ అవుతారో చెప్పలేని పరిస్థితి. టీజర్ ని బట్టి సినిమా మొత్తం సీరియస్ గా సాగే కథ అని తెలుస్తోంది. ఎంటర్టైన్మెంట్ కోసమే థియేటర్లకు వస్తోన్న ఆడియన్స్ ఈ సీరియస్ కథను ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటారో చూడాలి!
Most Recommended Video
చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!