Vishwak Sen: బాక్సాఫీస్ వద్ద హిట్టే.. కానీ ఇక్కడ దెబ్బేసింది.. !

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘దాస్ క ధమ్కీ’. ఈ చిత్రానికి డైరెక్టర్ కూడా విశ్వక్ సేనే. అంతేకాదు కరాటే రాజుతో కలిసి నిర్మాణంలో కూడా భాగస్వామిగా వ్యవహరించాడు విశ్వక్ సేన్. సినిమాకి రూ.20 కోట్లు బడ్జెట్ పెట్టినట్టు విశ్వక్ తెలిపాడు. కానీ అతను చెప్పినంత బడ్జెట్ కాలేదు అని ఇన్సైడ్ టాక్. ఏదైతేనేం.. విశ్వక్ సినిమా క్రేజ్ ను చూసి.. ఓ బయ్యర్ ‘దాస్ క ధమ్కీ’ కంప్లీట్ రైట్స్ అన్నీ తనకు ఇచ్చేయమని..

అందుకు గాను రూ.20 కోట్లు చెల్లిస్తానని ఆ బయ్యర్ ఆఫర్ ఇచ్చాడు. అంటే ఆ సినిమాని పూర్తి హక్కులు ఇక అతని సొంతం అన్నమాట. అప్పుడు సినిమా సక్సెస్ అయితే వచ్చే లాభాలు అన్నీ అతనే తీసుకుంటాడు. డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ ఇలా అన్నీ అతనికే సొంతమన్న మాట. అప్పుడు విశ్వక్ కంప్లీట్ గా సేఫ్ అయిపోయినట్టే..! కానీ అతను అందుకు అంగీకరించలేదు. తన సినిమా మీద ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లో ఏమో కానీ..

‘దాస్ క ధమ్కీ’ హక్కులను అతని వద్దే ఉంచుకున్నాడు. మార్చ్ 22న అంటే ఉగాది రోజున సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కంప్లీట్ గా నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ పండుగ హాలిడే అడ్వాంటేజ్ వల్ల రిలీజ్ రోజున విశ్వక్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్ అడ్వాంటేజ్ వల్ల బయ్యర్స్ అంతా సేఫ్ అయిపోయారు.థియేట్రికల్ హక్కులు రూ.8 కోట్లు మాత్రమే కాబట్టి.. బయ్యర్స్ హ్యాపీ. కాకపోతే విశ్వక్ సేన్ కు ఇంకో రూ.12 కోట్లు కావాలి.విడుదలకి ముందు ఓటీటీ రైట్స్ రూ.8 కోట్ల వరకు పలికాయట.

కానీ సినిమాకి మొదటిరోజు నెగిటివ్ టాక్, రివ్యూస్ రావడంతో ఇప్పుడు ఓటీటీ రైట్స్ రూ.6 కోట్లు కూడా పలకడం లేదట. సో సినిమా హిట్టయినా విశ్వక్ సేన్ కు నష్టాలు తప్పలేదని స్పష్టమవుతుంది. తన సినిమాని ప్రమోషన్ చేయడం బాగా తెలిసిన విశ్వక్ సేన్ కు మార్కెటింగ్ స్ట్రాటజీలు మాత్రం తెలియడం లేదని స్పష్టమవుతుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus