‘బాహుబలి 2 ‘ 2017 లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చెప్పొచ్చు. తెలుగు సినిమాల్లో ‘బాహుబలి 2 ‘ కలెక్షన్స్ ను అధిగమించే సినిమా ఆ తర్వాత రాలేదు.’ఆర్.ఆర్.ఆర్’ కూడా ‘బాహుబలి 2 ‘ కలెక్షన్స్ ని అధిగమించలేకపోయింది. ఆ సినిమా రికార్డులను కొల్లగొట్టాలి అంటే మహేష్ – రాజమౌళి.. సినిమాకి లేదంటే మళ్ళీ ప్రభాస్ – రాజమౌళి కాంబోలో సినిమా వస్తే తప్ప..
‘బాహుబలి 2 ‘ కలెక్షన్స్ ని అధిగమించడం కష్టమనే చెప్పాలి. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘బాహుబలి 2 ‘ తర్వాత ప్రభాస్ ‘సాహో’ ‘రాధే శ్యామ్’ ‘ఆదిపురుష్’ వంటి సినిమాల్లో నటించాడు. అవి సక్సెస్ కాలేదు. కానీ ఇటీవల వచ్చిన ‘సలార్'(‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్) సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమాకి ‘బాహుబలి 2 ‘ ని ముడిపెడుతూ ఓ కామన్ పాయింట్ ఉన్నట్టు సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతున్నాయి.
అదేంటి అంటే.. (Baahubali 2) ‘బాహుబలి 2 ‘ లో ఓ నిండు సభలో ప్రభాస్ సేతుపతి తల నరికే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఇలాగే ‘సలార్’ లో కూడా అలాంటి సీన్ ఒకటి ఉంటుంది. స్నేహితుడి కోసం ఒక దొర తల నరికేస్తాడు ప్రభాస్. ఆ సీన్ అందరికీ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ కి కరెక్ట్ గా సరిపోతున్నాయి. ఎక్కడా కూడా అతిశయోక్తి అనిపించడం లేదు.
సో ప్రభాస్ తో సినిమాలు చేసే దర్శకులు ఇలాంటి హై- మూమెంట్ కలిగిన సన్నివేశాలు రాసుకుంటే బెటర్. అలా అని సేమ్ సీన్స్ రిపీట్ చేయమని కాదు. ప్రశాంత్ నీల్.. ప్రభాస్ ఇమేజ్ ని, ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని కథకి కూడా కరెక్ట్ గా సెట్ అయ్యే విధంగా ఇలాంటి సన్నివేశాలు రాసుకున్నాడు అని అంతా అనుకుంటున్నారు.