ఈ మధ్య కాలంలో సినిమా ఓవర్సీస్ టాకే చాలా కీలకంగా మారిపోయింది. అక్కడ ప్రీమియర్స్ నుండి ఇలాంటి టాక్ వస్తుందా అని మన ఫిలిం మేకర్స్ నిద్రాహారాలు మానేసి మరీ ఎదురుచూసే సందర్భాలు ఉన్నాయి. యూఎస్ ప్రీమియర్స్ కే ఈ రేంజ్ టెన్షన్ ఉంటే? తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది చాలా రిస్కీ స్టెప్. తేడా వస్తే రిలీజ్ రోజున మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావు. ‘శాకుంతలం’ సినిమాతో ఈ విషయం అందరికీ అర్థమైంది.
కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఫిలిం మేకర్స్ తమ సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ప్రీమియర్స్ వేసుకుంటున్నారు. అందులో చాలా సినిమాలు సక్సెస్ అయినవి ఉన్నాయి. ‘సార్’ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ‘సామజవరగమన’ వంటి సినిమాలకు ప్రీమియర్స్ వేయడం జరిగింది. ఆ సినిమాలకు అది బాగా కలిసొచ్చింది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఇప్పుడు మరో సినిమాకి కూడా ప్రీమియర్స్ వేయబోతున్నారట.
అది మరేదో కాదు ‘ఆర్.ఎక్స్.100 ‘ హీరో కార్తికేయ నటించిన (Bedurulanka 2012) ‘బెదురులంక 2012 ‘. కార్తికేయకి ‘ఆర్.ఎక్స్.100 ‘ తర్వాత చేసిన ఒక్క సినిమా కూడా.. ఆ సినిమా స్థాయిలో సక్సెస్ ను అందించలేదు. కానీ ‘బెదురులంక 2012 ‘ టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఈ మధ్య ఇలాంటి కొత్తదనం ఉన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా మేకర్స్ ప్రీమియర్స్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం.