Kiran Abbavaram: నటుడు కిరణ్ అబ్బవరంకు షాక్ ఇచ్చిన అభిమాని… అలా అనేసాడేంటీ?

తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా రాజా వారు రాణి వారు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు కిరణ్ అబ్బవరం. ఇలా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన ఈయన అనంతరం హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఫిబ్రవరి 17వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇలా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేసిన హీరో కిరణ్ అబ్బవరంకు ఒక నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఒక్కసారిగా హీరో షాక్ కి గురయ్యారు. ఈ సందర్భంగా ఓ అభిమాని హీరో కిరణ్ ను ప్రశ్నిస్తూ అన్న పెళ్లెప్పుడు అంటూ తన పెళ్లి గురించి ప్రశ్నించారు.

ఇలా పెళ్లి గురించి ప్రస్తావనకు తీసుకువచ్చిన ఆ నేటిజన్ వెంటనే మీరు నా మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోతే మీరు ఈ జీవితాంతం సింగిల్ గానే ఉంటారు అంటూ మరొక ట్వీట్ చేశారు. సదరు నెటిజన్ ఇలాంటి ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా హీరో కిరణ్ అబ్బవరం షాక్ అవుతూ అదేంటి బ్రదర్ అలా అనేసావు అంటూ తనకు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus