ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వై యస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబులది ప్రత్యేక స్థానం. ప్రజలు మెచ్చిన నాయకులుగా వీరిద్దరూ ఎదిగారు. దాదాపు ఒకేసారి రాజకీయాలలోకి అడుగుపెట్టిన ఈ రాయలసీమ నాయకులు ముఖ్యమంత్రులు కావడం విశేషం. పార్టీలు సిద్ధాంతాల పరంగా వీరిద్దరూ శత్రులు అయినా, వ్యక్తిగతంగా మంచి మిత్రులే. కాగా వీరి స్నేహంపై ఒక మూవీ తెరకెక్కనున్నట్లు తాజా సమాచారం. దర్శకుడు రాజ్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ బయోపిక్స్ నిర్మాతగా ఉన్న విష్ణు ఇందుకూరి తెరకెక్కిస్తున్నారట.
అలాగే తిరుమల రెడ్డి మరో నిర్మాతగా ఉంటారట. ఇక రెండు భాగాలుగా రానున్న ఈ భారీ ప్రాజెక్ట్స్ అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం. ఇక చంద్రబాబు మరియు వైస్సార్ కలిసి ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ తరపున కలిసి పనిచేయడం జరిగింది. తరచుగా చంద్రబాబు వైస్సార్ ఇంటికి వచ్చే వారట. అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య గవర్నమెంట్ లో చంద్రబాబు మంత్రిగా చేశారు. బాబుకు మంత్రి పదవి రావడంలో వైస్సార్ కీలక పాత్ర పోషించారట.
ఈ విషయాల వైస్సార్ సతీమణి విజయమ్మ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ని వీడిన బాబు టీడీపీ నేతగా, ఎన్టీఆర్ అల్లుడిగా మారడం జరిగింది. బాబు టీడీపీ అరంగేట్రం తర్వాత బాబు మరియు వైస్సార్ రాజకీయ శత్రువులు అయ్యారు. మరి ఎలాంటి అనేక ఆసక్తికర విషయాలు ఈ సిరీస్ లో చూపించనున్నారని సమాచారం.