సిగరెట్ భలే స్టైల్‌గా తాగుతున్నావ్ డార్లింగ్.. ప్రభాస్‌ని పొగిడిన రవితేజ.. పిక్ వైరల్..!

సోషల్ మీడియాలో ఓల్డ్ అయినా.. లేటెస్ట్ అయినా కానీ సినిమాలకు సంబంధించిన న్యూస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడలానే రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, మాస్ మహారాజా రవితేజ ముగ్గురూ కలిసున్న ఓ అన్‌సీన్ పిక్ తెగ చక్కర్లు కొడుతోంది. రామోజీ ఫిలిం సిటీలో ‘బాహుబలి’ షూటింగ్ జరుగుతున్నప్పుడు రవితేజ సెట్స్‌కి వచ్చాడు. రానాకి ఆరోజు షూట్ లేనట్టుంది.

అందుకే గెటప్‌లో లేడు. ఈ సందర్బంగా డార్లింగ్, రవితేజ, రానాల మధ్య సరదా సంభాషణ సాగింది. మాస్ మహారాజా తన స్టైల్ పంచ్ ఏదైనా విసిరాడేమో కానీ రానా, ప్రభాస్ మాత్రం బాగా నవ్వుతున్నారు. ఇక రవితేజ వెనక్కి తిరిగి ఉండడం వల్ల ఫోటోలో ఫేస్ కవర్ కాలేదు. ఈ రేర్ పిక్ బాగానే ఉంది కానీ డార్లింగ్ చేతిలో సిగరెట్ ఉంది చూశారా! అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజమే, మాట్లాడుతూనే..

టైం వేస్ట్ ఎందుకని పనిలో పనిగా దమ్ము కొడుతున్నాడు డార్లింగ్. ఇంతకుముందు ‘సాహో’ ప్రమోషన్స్‌కి బాంబే వెళ్లినప్పుడు కూడా మీడియా పర్సన్స్‌తో మాట్లాడుతూ.. సిగరెట్ ఇవ్వమని ప్రభాస్ అసిస్టెంటుకి సైగ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. ఇప్పుడు ‘బాహుబలి’ సెట్లో డార్లింగ్ దమ్మేస్తున్న అన్‌సీన్ పిక్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus