సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. దీనికి ముందు కూడా సిద్దు జొన్నలగడ్డ చాలా సినిమాల్లో నటించినప్పటికీ బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే ‘డీజే టిల్లు’ అనే చెప్పాలి. దీని తర్వాత సిద్ధుకి మంచి ఆఫర్లు వచ్చాయి. అటు తర్వాత చేసిన ‘టిల్లు స్క్వేర్’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో సిద్ధు రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. మార్కెట్ కూడా పెరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘జాక్’ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది. రూ.50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అయ్యింది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. 10 శాతం రికవరీ కూడా జరగలేదు. పైగా షూటింగ్ టైంలో కూడా సిద్దు ఎక్కువగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ హర్ట్ అయ్యారని..టాక్ కూడా నడిచింది.
ఇక ‘జాక్’ డిజాస్టర్ కావడంతో సిద్ధుపై ఇండస్ట్రీ సర్కిల్స్ కొంత నెగిటివిటీ ఏర్పడింది. ఇక అతనికి పెద్ద అవకాశాలు రావడం కష్టమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. సిద్ధు నెక్స్ట్ మూవీ ‘తెలుసు కదా’ పై కూడా అంచనాలు పెద్దగా లేవు. అయినప్పటికీ సిద్ధు ఖాతాలో క్రేజీ ఆఫర్ పడింది. అతనితో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా చేసి ఓటీటీ హిట్ ఇచ్చిన రవికాంత్ పెరెపు దర్శకత్వంలో ‘బ్యాడాస్’ అనే మాస్ మూవీ చేయబోతున్నాడు.
‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.80 కోట్లు బడ్జెట్ అవుతుందని వినికిడి. ‘టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి.. ఈ కాంబినేషన్లో వచ్చే ‘బ్యాడాస్’ పై యూత్ ఫోకస్ గట్టిగానే ఉంటుంది.