Tollywood: ఈ టాలీవుడ్ హీరోలు అమ్మ చేతిలో దెబ్బలు తిన్నారని మీకు తెలుసా?

అమ్మను మించిన దైవం ఉండదనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన చాలామంది హీరోల వెనుక ఆ హీరోల తల్లుల సపోర్ట్ ఎంతో ఉంది. హీరోల, హీరోయిన్ల తల్లులు ఆయా హీరోలు కెరీర్ పరంగా అంచనాలకు మించి సక్సెస్ సాధించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. అయితే అమ్మ చేతిలో దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అల్లరి పనులకు సంబంధించి ఎన్నో విషయాలు ప్రచారంలో ఉన్నాయి.

తారక్ చేసే అల్లరి పనులను తట్టుకోలేక ఎన్టీఆర్ తల్లి షాలిని బెల్ట్ తో కొట్టిన సందర్భాలు సైతం ఉన్నాయని సమాచారం అందుతోంది. ఒక సందర్భంలో తారక్ మాట్లాడుతూ మా అమ్మ నన్ను చితక్కొట్టేదని చెప్పుకొచ్చారు. ఒకసారి ట్రాన్స్ ఫార్మర్ లో బల్బు పెట్టి అది పేలేలా చేశానని నేను చేసిన పని వల్ల మూడు రోజులు కరెంట్ లేదని తారక్ అన్నారు. ఈ విషయం అమ్మకు తెలీకుండా మేనేజ్ చేశానని ఎన్టీఆర్ వెల్లడించారు.

అమ్మ రాయబోయే పరీక్షల గురించి అడిగితే నేను తప్పుగా చెప్పడం వల్ల అమ్మ చేతితో తన్నులు తిన్నానని అల్లు అర్జున్ ఒక సందర్భంలో పేర్కొన్నారు. లవ్ లెటర్ రాయడం ద్వారా సాయిపల్లవి కూడా ఒక సందర్భంలో తల్లి చేతిలో దెబ్బలు తిన్నారు. బాలయ్య బాబు పాట పాడటం వల్ల అడివి శేష్ కూడా తల్లి చేతిలో దెబ్బలు తిన్నాడట. గత కొంతకాలంగా అడివి శేష్ వరుసగా విజయాలను అందుకుంటున్నారు.

టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరోలలో ఒకరైన నాగశౌర్య సైతం సరిగ్గా చదువుకోకపోవడం వల్ల తల్లి చేతిలో దెబ్బలు తిన్నారట. సూర్య నమస్కారాలు చేస్తున్న సమయంలో తల్లిని డిస్టర్బ్ చేయడంతో హన్సిక సైతం తన తల్లి చేతిలో దెబ్బలు తిన్నారు. మరో యంగ్, టాలెంటెడ్ హీరో మనోజ్ సైతం చిన్నప్పుడు తల్లి చేతిలో దెబ్బలు తిన్నాడట. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు, హీరోయిన్లు తల్లి చేతిలో దెబ్బలు తిన్నారని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus