దర్శకులు నిర్మాతలుగా మారడం ఎక్కువగా చూస్తుంటాం. అయితే రచయితలు నిర్మాతలుగా మరడం చాలా తక్కువ. తెలుగులో ఇలాంటి వాళ్లు గతంలో కొంతమంది కనిపించారు. అయితే వాళ్లు దర్శకులుగా మారాక నిర్మాణ సంస్థలవైపు వచ్చారు. తాజాగా మరో రచయిత ఇలా నిర్మాత అవుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆయన సినిమా మొదలవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఆయన సినిమా ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పేరు కూడా బయటకు వచ్చింది. రచయితగా సాయి మాధవ్ బుర్రా చాలామందికి తెలుసు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మాటలు రాశారాయన.
అలా అనతి కాలంలోనే స్టార్ రైటర్ అయిపోయారు. ఇప్పుడు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న అతి పెద్ద సినిమాల్లో ఆయన భాగస్వామి. అలాంటి ఆయన నిర్మాతగా మారారు. ఎస్‌ఎంఎస్ అనే నిర్మాణ సంస్థని ప్రారంభించారు. అంటే సాయి మాధవ్ స్క్రిప్ట్స్ అని అర్థం. ఈ బ్యానర్ మీద తొలి ప్రయత్నంగా ఈటీవీ విన్‌తో కలసి ఓ సినిమాని నిర్మించే పనిలో ఉన్నారు. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడ్ని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.
అంతేకాదు ఈ సినిమాకు బుర్రా సాయిమాధవ్ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు కూడా అందిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ నుండి కొత్త దర్శకులకు, ప్రతిభావంతులకు అవకాశాలు ఇవ్వాలన్నది ప్రయత్నమని సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ నిర్మాణ సంస్థ నుండి చిన్న సినిమాలు విత్ కొత్త దర్శకులు వరుసగా వస్తాయి అని చెప్పొచ్చు. మరి ఎవరెవరు ఈ అవకాశం అందుకుంటారో చూడాలి. ఆయన దగ్గర టీమ్‌లో చాలామంది యువత ఔత్సాహిక రచయితలు ఉన్నారు.
మరోవైపు రచయితగా ఫుల్ బిజీగా ఉన్నారు (Sai Madhav Burra) సాయిమాధవ్. చిరంజీవి – వశిష్ఠ మల్లిడి ‘విశ్వంభర’ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. ప్రభాస్ – నాగ్ అశ్విన్‌ల సినిమా ‘కల్కి 2898 ఏడీ’కి కూడా ఆయనే రచయిత. క్రిష్ – అనుష్క కాంబినేషన్‌లో త్వరలో ప్రారంభమవుతుంది అంటున్న కొత్త చిత్రానికీ బుర్రానే మాటలు రాస్తున్నారు. ఇవికాకుండా మరో ఆరేడు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయని చెబుతున్నారు.
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!