టెంట్‌లు వేసి సినిమాలు ప్రదర్శించడం గురించి మీకు తెలుసా? ఇప్పటి జనాలకు ఈ కాన్సెప్ట్ తెలియకపోవచ్చు కానీ… గత తరం వారికి బాగా తెలుస్తుంది. మల్టీప్లెక్స్‌లు, థియేటర్లు రాని ముందు కాలంలో సినిమాలు అలానే వేసేవారు. తాజాగా అలాంటి ప్రయత్నమే జరిగింది. అయితే అది మన లాంటి ప్రాంతాల్లో కాదు. సముద్రమట్టానికి 11,562 అడుగుల ఎత్తులో. అదీ ఇక్కడి విషయం. ఇలా సినిమా వేసింది జమ్ముకశ్మీర్‌లోని లేహ్‌లో. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న థియేటర్ అట.
పిక్చర్ టైమ్ డిజీ ప్లెక్స్ పేరుతో ఓ సంస్థ లేహ్‌లో ఈ థియేటర్‌ను ఏర్పాటు చేసింది. సాధారణ థియేటర్లకు భిన్నంగా దీనిని రూపొందించారు. అక్కడ మైనస్ 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటమే దీనికి కారణం. పైన ఫొటోలో చూపిస్తున్నట్లు వైవిధ్యంగా ఉంటుంది దీని సెటప్. లోపల లైటింగ్, సౌండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి థియేటర్‌లో ఇటీవల అక్షయ్ కుమార్ ‘బెల్‌బాటమ్’సినిమాను ప్రదర్శించారట. అయితే ఈ సినిమా ఆ థియేటర్‌లో తొలి చిత్రమేమీ కాదు.
ఈ థియేటర్ ప్రారంభం నాడు ‘సెకూల్’అనే షార్ట్ ఫిల్మ్‌ను తొలిసారి ప్రదర్శించారట. ఇటీవల వేసిన ఓ షోలో కొంతమంది సైనికులు, అధికారులు వీక్షించారట. వారితోపాటు నటుడు పంకజ్ త్రిపాఠి తదితరులు కూడా చూశారట. ఈ సందర్భంగా థియేటర్‌ను, ఏర్పాట్లను వారు ప్రశంసించారు. అక్షయ్ సినిమాకు ఆదరణ లేకపోయినా… ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న థియేటర్‌లో సినిమా వేసిన ఘనత అయితే దక్కింది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!