Pushpa2: అల్లు అర్జున్ తర్వాతేనా ఇక ఏ హీరోనైనా..!

2021లో పుష్ప 1: ది రైజ్ మూవీతో దేశవ్యాప్తంగా బంపర్ హిట్ కొట్టారు అల్లు అర్జున్. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు. ఈ చిత్రానికి సీక్వెల్‍గా ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’ రూపొందుతోంది. దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్ కంటే ఈ సీక్వెల్‍ను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. 2024 ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా అప్‍డేట్ల కోసం ఐకాన్ స్టార్ ఫ్యాన్ ఎదురుచూస్తునే ఉన్నారు.

ఈ క్రమంలో పుష్ప 2: ది రూల్ (Pushpa2) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల ఒప్పందం పూర్తయిందనే సమాచారం బయటికి వచ్చింది. పుష్ప 2: ది రూల్ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ తాజాగా జరిగినట్టు సమాచారం బయటికి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కైవసం చేసుకున్నట్టు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక తమ ప్లాట్‍ఫామ్‍లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేసుకునేందుకు నెట్‍ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకుందని వెల్లడైంది.

రికార్డు ధరకు పుష్ప 2 డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాట. పుష్ప 2: ది రూల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్సులు ఈ మూవీలో ఉండనున్నాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ సిండికేట్‍కు లీడర్ అయ్యాక పుష్ప (అల్లు అర్జున్) రూల్ చేయడం ఈ మూవీలో ఉండనుంది. పుష్ప 2 సినిమా కోసం టాలీవుడ్‍తో పాటు బాలీవుడ్ కూడా ఎదురుచూస్తోంది.

మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ఈ సినిమా ఉంది. పుష్ప 1 సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్, మేనరిజమ్స్, లుక్ ఫుల్ ఫేమస్ అయ్యాయి. దేశమంతా ఈ మూవీ పేరు మార్మోగింది. చాలా మంది సెలెబ్రిటీలు, క్రికెటర్లు అల్లు అర్జున్ స్టైల్‍ను అనుకరిస్తూ వీడియోలు కూడా చేశారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus