Kalki: ఆ విషయంలో భయపడుతున్న ప్రభాస్..!

మన టాలీవుడ్ నుండి నేటి తరంలో మొట్టమొదటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు చెప్పేస్తారు ఎవరైనా. ఎందుకంటే బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఆయన సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ఆ సిరీస్ తర్వాత ప్రభాస్ దురదృష్టం కొద్దీ వరుసగా మూడు ఫ్లాప్స్ వచ్చాయి. కంటెంట్ పరంగా అవి ఫ్లాప్స్ అనిపించుకున్నాయి కానీ ఆ సినిమాకి వచ్చిన వసూళ్లు మన టాలీవుడ్ మిగిలిన స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలతో సమానమైన వసూళ్లు అని చెప్పొచ్చు.

ఫ్లాప్ టాక్ తోనే ఈ రేంజ్ వసూళ్లను రాబడితే ప్రభాస్ కి ఒక్కసారి హిట్ టాక్ వచ్చిందంటే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో మన ఊహకి కూడా అందదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తుంటే అలాగే ఉంది. ఆయన హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం తర్వాత అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’.

ఈ సినిమాకి (Kalki) సంబంధించిన టీజర్ కి ఎంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మన అందరం చూసాము. సరికొత్త కాన్సెప్ట్ తో డైరెక్టర్ నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ మహాభారతం లోని అశ్వథామ పాత్ర ని పోషించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ గెటప్ ని ప్రస్తుతానికి ముసుగు కప్పేసి రహస్యం గా ఉంచారు మేకర్స్.

అయితే ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ మరియు ప్రభాస్ మధ్య ఒక భీకరమైన పోరు ఉంటుందట. సినిమాకి మేజర్ హైలైట్స్ లో ఇదే. అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ తో ఫైట్ సన్నివేశం అంటే బాలీవుడ్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనే భయం ప్రభాస్ లో ఉంది. కానీ ఈ సన్నివేశం చూస్తున్నంత సేపు ఆడియన్స్ ఊపిరి బిగపెట్టుకొని చూస్తారట. ఆ రేంజ్ లో ఈ సన్నివేశం వచ్చిందని టాక్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus