కాజల్ ప్రేమ వ్యవహారం ఇప్పటిది కాదట

చడీ చప్పుడు లేకుండా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. తనను ఆరాధించే ఫ్యాన్స్ కలలకు కళ్లెం వేస్తూ సారీ నా పెళ్లి అనేసింది. దాదాపు 14ఏళ్ల సినీ కెరీర్ లో కాజల్ పై లవ్ ఎఫైర్స్ వార్తలు పెద్దగా వచ్చినా దాఖలాలు లేవు. అడపాదడపా వచ్చినా అవి తక్కువ కాలంలోనే అంతం అయిపోయేవి. సడన్ గా కాజల్ యువ బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించడం జరిగింది.దీనితో అసలు ఎవరు ఈ గౌతమ్ కిచ్లు అనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది.

ఇక వీరి పరిచయం ఎలా, ప్రేమ ఎప్పుడు మొదలైంది వంటి విషయాలపై కూడా మీడియా ద్రుష్టి పెట్టింది. కాగా గౌతమ్ మరియు కాజల్ ల ప్రేమ బంధం ఇప్పటిది కాదని సదరు వార్తా కథనాల సారాంశం. దాదాపు నాలుగేళ్లకు పైగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందట. అప్పుడప్పుడూ గౌతమ్ తో కాజల్ ఫోటోలు లీకైనా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. దానికి కారణం గౌతమ్ పెద్ద సెలెబ్రిటీ కాకపోవడమే. గౌతమ్ కాజల్ ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలుస్తుండగా తరచుగా ఇరుకుటుంబాల సభ్యులు కలుసుకుంటారట.

కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లి కార్యక్రమాన్ని అన్నీ తానై గౌతమ్ నడిపారట. అలా గౌతంతో చాలా కాలంగా కాజల్ రిలేషన్ లో ఉన్నారట. ఐతే వీరి వ్యవహారం బయటికి రాకపోవడానికి కారణం, ఫ్యామిలీ ఫ్రెండ్ కావడం అలాగే, గౌతమ్ ని గురించి ఎవరికీ తెలియకపోవడం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి అవుతుండగా, కాజల్ పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus