స్టార్ హీరో నాగార్జున నా సామిరంగ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం నా సామిరంగ మూవీ కలెక్షన్ల విషయంలో ఫ్లాప్ కిందే లెక్క అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ టార్గెట్ తో విడుదలైనా ఈ సినిమా అక్కడ మాత్రం బ్రేక్ ఈవెన్ కాలేదని భోగట్టా.
అయితే నా సామిరంగ మూవీ విషయంలో ఈ విధంగా జరగడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. ఓవర్సీస్ లో నా సామిరంగ ప్రీమియర్స్ మెజారిటీ థియేటర్లలో ప్రదర్శితం కాలేదు. ఈ సినిమాకు ఓవర్సీస్ విషయంలో బిజినెస్ విషయంలో సైతం కొన్ని సమస్యలు ఎదురయ్యాయని తెలుస్తోంది. ఆలస్యంగా నా సామిరంగ షోలు ఓవర్సీస్ లో ప్రదర్శితం కావడంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది.
నా సామిరంగ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి ఉంటే ఓవర్సీస్ లో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి తప్పులు జరిగేవి కావు. మరోవైపు నాగ్ వరుసగా సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. నాగ్, ధనుష్ కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు నాగ్ తమిళ దర్శకుడు నవీన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు 12 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కిందని తెలుస్తోంది. నాగ్ వరుస విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు కెరీర్ పరంగా మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. నాగ్ (Nagarjuna) కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.