Hero Nani: ”సెల్ఫీ ఇవ్వకపోతే షూటింగ్ ఆపేస్తా”

సెలబ్రిటీలను సాధారణ ప్రేక్షకులు ఎంతగా అభిమానిస్తారో తెలిసిందే. స్టార్ హీరో, హీరోయిన్లకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కొందరు హీరోలు తమ అభిమానులని నిరాశపరచకుండా ఆన్ లొకేషన్ కు పిలిపించుకొని మరీ సెల్ఫీలు ఇస్తుంటారు. కొందరు వీకెండ్స్ లో ఇంటికి పిలిపించుకొని కాసేపు ముచ్చటిస్తుంటారు. ఇక నేచురల్ స్టార్ నానికి జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నాని ఇష్టపడుతుంటారు. అలాంటి నానికి షూటింగ్ స్పాట్ లో ఓ అభిమాని వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నాని అభిమానుల్లో ఒకరు ‘శ్యామ్ సింగరాయ్’ సెట్స్ కి వచ్చి తనతో సెల్ఫీ దిగాల్సిందేనని పట్టుబట్టాడట. రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ”మీరు నాతో సెల్ఫీ దిగకపోతే.. నేనిక్కడ షూటింగ్ జరగనివ్వను” అంటూ నాని అభిమాని ఫన్నీగా హెచ్చరించాడట. ఆ క్షణంలో నాని ఎంతో ఆశ్చర్యపోయాడట. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన అభిమానితో నాని సెల్ఫీ దిగి అతడి గురించి తెలుసుకున్నాడట. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

కరోనా ఉధృతి తగ్గిన తరువాత షూటింగ్ ను మొదలుపెడతారు. కలకత్తాలో నిర్మించిన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించనున్నారు. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus