Ravi Teja, Anudeep: రవితేజ – అనుదీప్ పై అసత్య ప్రచారం.. ఏం జరిగిందంటే?

రవితేజ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సీరియస్ రోల్స్ చేస్తున్నాడు. అతని ప్లస్ పాయింట్ కామెడీ. దానిని అతను పక్కన పెట్టేసి, సంపూర్ణ నటుడు అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అతని ప్రయత్నాలు అన్నీ బెడిసికొట్టేస్తున్నాయి. ‘ధమాకా’ కి ముందు చేసిన ‘ఖిలాడి’ ‘రామారావు ఆన్ డ్యూటీ’ … ‘ధమాకా’ తర్వాత చేసిన ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ ‘ఈగల్’ వంటి సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో తన మార్క్ మాస్ అండ్ కామెడీ టచ్ ఉన్న సినిమాలు చేయాలని రవితేజ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మాస్ టచ్ ఉన్న సినిమానే. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోపక్క కామెడీ టచ్ ఉన్న సినిమాని ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో చేయాలని డిసైడ్ అయ్యాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా ‘ఏజెంట్’ ‘గాండీవధారి అర్జున’ చిత్రాల హీరోయిన్ సాక్షి వైద్య ఫిక్స్ అయ్యిందంటూ ప్రచారం గట్టిగా జరుగుతుంది.

కానీ అందులో నిజం లేదు అని ఇన్సైడ్ టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్టులో (Ravi Teja) రవితేజకి జోడీగా ‘సప్త సాగరాలు ధాటి’ ఫేమ్ రుక్ష్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపికైందట. అలాగే ఈ ప్రాజెక్టుకి ‘మంగళవారం’ ‘హనుమాన్’ వంటి క్రేజీ సినిమాలకు పనిచేసిన దాశరథి శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా ఎంపికైనట్టు కూడా తెలుస్తుంది.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus