Ram Charan, Pawan Kalyan: పవన్ కోసం చరణ్ సంచలన నిర్ణయం?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్న నటులలో రామ్ చరణ్ ఒకరు. చరణ్ నటించిన ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. చరణ్ శంకర్ కాంబో మూవీ పూజా కార్యక్రమాలు ఈ నెల 8వ తేదీన జరగగా ఈ సినిమా కోసం దిల్ రాజు ఏకంగా 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ బిజినెస్ మేన్ గా కూడా కొనసాగుతున్నారు.

ట్రూజెట్ సంస్థలో రామ్ చరణ్ ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఒక టీవీ ఛానల్ ను కొనబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఒక టీవీ ఛానల్ పై చరణ్ దృష్టి పెట్టారని వైరల్ అవుతున్న వార్త సారాంశం. అయితే ఈ వార్తకు సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది. చరణ్ న్యూస్ ఛానల్ ను కొనుగోలు చేస్తే పవన్ పార్టీకి ఆ ఛానల్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.

మరి నిజంగా రామ్ చరణ్ ఛానల్ ను కొనుగోలు చేస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త విషయంలో సంతోషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటాలని జనసేన ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేన ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. రామ్ చరణ్ కు బాబాయ్ పవన్ అంటే విపరీతమైన అభిమానం అనే సంగతి తెలిసిందే. చరణ్ ఏ న్యూస్ ఛానల్ ను కొనుగోలు చేస్తారో తెలియాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus