సింగనమల ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు..!

Ad not loaded.

సింగనమల రమేష్ బాబు (Singanamala Ramesh Babu).. ఒకప్పుడు టాలీవుడ్లో ఈ పేరు మార్మోగింది. పెద్ద సినిమాలకి ఫైనాన్సియర్ గా వ్యవహరించిన ఈయన రాజశేఖర్ (Rajasekhar) తో విలన్, తమిళంలో విజయ్ (Vijay Thalapathy) వంటి స్టార్ హీరోతో ‘పోకిరి’, అలాగే తెలుగులో రవితేజతో (Ravi Teja) ‘వీడే’ (Veede) వంటి సినిమాలను నిర్మించారు. తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) ‘కొమరం పులి’ (Komaram Puli), మహేష్ బాబుతో (Mahesh Babu) ‘ఖలేజా’ (Khaleja) వంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా నిర్మించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

Ramesh Babu

అటు తర్వాత ఈయనపై పలు కేసులు నమోదవడం వలన జైలు పాలు అయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చినా.. కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఫైనల్ గా జనవరి 31న ఈయన కేసును సరైన ఆధారాలు లేని కారణంగా కోర్టు కొట్టేయడం జరిగింది. సింగనమలపై ఒక్క కేసు కాదు. దాదాపు 10 కి పైనే కేసులు నమోదయ్యాయి. సినీ పరిశ్రమకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మొత్తానికి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు సింగనమల.

‘ఖలేజా’ ‘కొమరం పులి’ వంటి సినిమాలు డిజాస్టర్లు అయ్యి వంద కోట్లు నష్టపోతే హీరోలు కనీసం ఆదుకోలేదని అన్నారు. వాస్తవానికి ఆ సినిమాలకి అంత బడ్జెట్ అవుతుందా? పెద్ద హీరోలతో తీసినప్పుడు మినిమమ్ ఓపెనింగ్స్ రాకుండా ఉంటాయా? అయినా సరే 3 ఏళ్ళు తీశాడు కాబట్టి.. వంద కోట్లు లాస్ అన్నాడు. సరే.. సినిమా ఆడకపోతే నిర్మాతని హీరో ఆదుకోవాలనే రూల్ ఏమైనా ఉందా? ఆదుకుంటే గొప్ప విషయమే.

కానీ సినిమా హిట్ అయ్యి నిర్మాతకి భారీ లాభాలు వస్తే హీరోలకి ఏమైనా ఇస్తారా? ఇలాంటివి సింగనమలకి తెలీనివి కాదు కదా..! ‘కథలు ఒప్పేసుకుని, హీరోల డేట్స్ ఉన్నాయి అని సినిమా తీయకూడదు’ అని సింగనమల ఇప్పటికి తెలుసుకున్నాడు. కానీ జైలుకు పోయినప్పటికీ ఇండస్ట్రీ అండగా నిలబడలేదు అనడం కరెక్ట్ కాదు. పదికి పైగా కేసులు నమోదైనప్పుడు? నిజమేంటో తెలీనప్పుడు ఇండస్ట్రీ జనాలు ఊరికే ఎలా మద్దతు పలుకుతారు. ఇలాంటివి కూడా సింగనమల గుర్తించాల్సిన అవసరం ఉంది.

‘బిందాస్’ నిర్మాత చేసిన పొరపాటు అదే.. 15 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus