మంచు మనోజ్ (Manchu Manoj) కెరీర్లో కూడా కొన్ని హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో ‘బిందాస్’ (Bindaas) ఒకటి. వీరు పోట్ల (Veeru Potla) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. షీనా శహబాది (Sheena Shahabadi) హీరోయిన్ గా చేసింది. బోబో శశి (Bobo Shashi) అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. 2010 ఫిబ్రవరి 5న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
కానీ మౌత్ టాక్ పాజిటివ్ గా రావడం వల్ల బాక్సాఫీస్ వద్ద కూడా క్లీన్ హిట్ గా నిలిచింది. రూ.3 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రూ.8 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అయితే ఈ సినిమాకి ప్రభాస్ (Prabhas) ఆల్ టైం హిట్స్ లో ఒకటైన ‘మిర్చి’ కి (Mirchi) చిన్న లింక్ ఉందట. అదేంటంటే.. ‘మిర్చి’ సినిమా కథని ముందుగా నిర్మాత అనిల్ సుంకరకి (Anil Sunkara) వినిపించారట దర్శకులు కొరటాల శివ (Koratala Siva).
‘తన శత్రువుల వల్ల తన కుటుంబానికి అలాగే ఊరికి ప్రమాదం ఉందని. ఆ గొడవలు ఎలాగైనా తగ్గించి తన ఊరు, కుటుంబాన్ని కాపాడుకోవాలి అని ఆరాట పడే పెద్ద…తర్వాత ఓ సంఘటన వల్ల హీరోని అతను బయటకు గెంటేయడం. తర్వాత విషయం తెలుసుకుని హీరో సమస్యలు తీర్చడానికి విలన్ ఇంటికి వెళ్లడం’ ఇది ‘మిర్చి’ సినిమా లైన్. ఇలా అనుకుంటే ‘బిందాస్’ సినిమా లైన్ కూడా అదే అని చెప్పాలి.
ఈ విషయమే దర్శకుడు కొరటాల శివకి చెప్పి అనిల్ సుంకర ఎస్కేప్ అయ్యాడట. అయినప్పటికీ ‘బిందాస్’ ఆడింది. ‘మిర్చి’ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. కాకపోతే ‘మిర్చి’ ని కొరటాల శివ వేరే బ్యానర్లో తీశాడు. అదే అనిల్ సుంకర కనుక ఇంకోసారి ఆలోచించి అతని బ్యానర్లోనే తీసి ఉంటే.. అతనికి భారీ లాభాలు వచ్చి ఉండేవి. ఇలా ఆయన మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అనే చెప్పాలి.