ఏ డైరెక్టర్ కి అయినా ఒక టీం ఉంటుంది. వాళ్ళని అసిస్టెంట్ డైరెక్టర్స్(ఎడి) అంటుంటారట.కథకి సంబంధించిన ఐడియాలు ఇవ్వడంలో కావచ్చు.. వాటిని డెవలప్ చేయడంలో కావచ్చు.. వీళ్లది కీలక పాత్ర అవుతుందట. సెట్స్ లో కూడా డైరెక్టర్లు ఏం చెబితే అది వీళ్ళు చేస్తుంటారు. డైరెక్టర్స్ వీళ్ళకి డబ్బులు సరిగ్గా ఇస్తారా లేదా అనేది కచ్చితంగా చెప్పలేం. కానీ టాప్ డైరెక్టర్ వద్ద పనిచేస్తే..పెద్ద నిర్మాతలతో పరిచయాలు అవి ఏర్పడి తర్వాత డైరెక్షన్ ఛాన్స్ వస్తుందని కొంతమంది ఆశపడుతుంటారు. అలాంటి వాళ్ళని ఓ స్టార్ డైరెక్టర్ వేధిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఎలా అంటే..!
అప్ కమింగ్ రైటర్స్ ఎవరైనా.. ఈ డైరెక్టర్ కి ఫోన్ చేసి కథ ఉంది అని చెబితే.. ముందు మంచిగా మాట్లాడతాడట. కథ వినడానికి ఓ పబ్బులో అపాయింట్మెంట్ ఇస్తాడట. ఆ టైంకి ఈ రైటర్ వెళ్తాడు. గంట గడిచాక ఆ దర్శకుడు పబ్బుకి వస్తాడు. ఇక సిట్టింగ్ వేశాక.. ఆ దర్శకుడు పెగ్గులు తాగడం మొదలుపెడతాడు. స్టఫ్ తినే టైంలో ఆ రైటర్ తో బాగా మాట్లాడతాడట. కథ బాగుంది అని హోప్స్ ఇస్తాడట.ఆ తర్వాత కడుపు నిండాక ఆ దర్శకుడు.. ‘ఇది కొత్తగా లేదు, ఆల్రెడీ ఇలాంటివి నేను కూడా రాసుకున్నాను. వర్కౌట్ అవ్వడం కష్టం అని వదిలేశాను.
కొత్త ఐడియాలతో మళ్ళీ మీట్ అవ్వు’ అని చెప్పేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతాడట ఆ స్టార్ డైరెక్టర్. పాపం ఆ రైటర్ కిందా మీద పడి బిల్లు కట్టేసి.. ఆ తర్వాతి రోజు కొత్త ఐడియాతో ఆ స్టార్ డైరెక్టర్ కి ఫోన్ చేస్తే అతను లిఫ్ట్ చేయడట. కొన్ని గంటలకి వీళ్ళ నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టేస్తాడట. ఆ స్టార్ డైరెక్టర్ ఇలా ఇప్పటివరకు ముగ్గురు అప్ కమింగ్ రైటర్స్ ని మోసం చేశాడట. కానీ వాళ్ళు చేసేదేం ఉంటుంది. ఇక 5 ఏళ్లుగా ఆ స్టార్ డైరెక్టర్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.
ఇతను స్పీచ్ బాగా ఇస్తాడు.. చాలా మందికి లాజికల్ గా చురకలు అంటిస్తాడు కాబట్టి.. కొంతమంది నిర్మాతలు ఇతన్ని ఈవెంట్లకి గెస్ట్ గా ఆహ్వానిస్తారట. మరోపక్క ఆ నిర్మాతలు కూడా ఇతనికి అడ్వాన్సులు ఇచ్చి చాలా కాలం అవుతుంది అనే ఉద్దేశంతో.. సినిమా వెంటనే అడక్కుండా ఈ స్టార్ డైరెక్టర్ వాళ్ల ఈవెంట్లకి వెళ్లి.. స్పీచ్ లో భాగంగా వారికి బిస్కెట్లు వేస్తుంటాడని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటూ ఉంటారు.