ఏ సినిమా ప్రమోషన్స్ కి అయినా మంచి మైలేజ్ అందించేది లిరికల్ సాంగ్స్ అనే చెప్పాలి. పాటలు కనుక బాగుంటే సినిమా సగం హిట్ అయినట్టే అనేది అందరి నమ్మకం. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఫస్ట్ లిరికల్ సాంగ్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ పాట కనుక పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటే కచ్చితంగా నెక్స్ట్ సాంగ్స్ పై ప్రమోషనల్ యాక్టివిటీస్ పై జనాల ఫోకస్ పడుతుంది. మరోపక్క ఆ లిరికల్ సాంగ్స్ కి ఎన్ని లైక్స్ ని, వ్యూస్ పడ్డాయి అనేది కూడా ట్రెండింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ మధ్య పెద్ద సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయ్యే ఫస్ట్ సింగిల్స్ కి పెద్ద రేంజ్లో రెస్పాన్స్ అయితే రావడం లేదు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేసి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ నమోదు చేసిన పాటలు ఏంటో, టాప్ -10 లో ఏ పాటలు చోటు చేసుకున్నాయో ఓ లుక్కేద్దాం రండి :
1) ధం మసాలా :
మహేష్ (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో ‘అతడు’ (Athadu) ‘ఖలేజా’ (Khaleja) వంటి సినిమాల తర్వాత వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ గా ‘ధం మసాలా’ సాంగ్ రిలీజ్ అయ్యింది. 24 గంటల్లో ఈ పాట 17.42 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసి ఇప్పటికీ నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతుంది.
2) పెన్నీ :
మహేష్ బాబు- పరశురామ్ (Parasuram) కాంబినేషన్లో రూపొందిన ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్ గా రిలీజ్ అయిన ఈ ‘పెన్నీ’ పాట 24 గంటల్లో 16.38 వ్యూస్ ని నమోదు చేసి ఇప్పటికీ నెంబర్ 2 ప్లేస్ లో కొనసాగుతుంది.
3) కళావతి :
మహేష్ – పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ గా రిలీజ్ అయిన ఈ ‘కళావతి’ పాట 24 గంటల్లో 14.78 వ్యూస్ ని నమోదు చేసి ఇప్పటికీ నెంబర్ 3 ప్లేస్ లో కొనసాగుతుంది.
4) మ మ మహేష :
మహేష్ – పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి 4వ లిరికల్ సాంగ్ గా గా రిలీజ్ అయిన ఈ ‘మ మ మహేష’ 24 గంటల్లో 13.56 వ్యూస్ ని నమోదు చేసి ఇప్పటికీ టాప్ 4 ప్లేస్ లో కొనసాగుతుంది.
5) ఉ అంటావా ఉఊ అంటావా :
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ (Pushpa) నుండి 5వ లిరికల్ సాంగ్ గా రిలీజ్ అయిన ఈ ‘ఉ అంటావా ఉఊ అంటావా’ పాట 24 గంటల్లో 12.39 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టి ఇప్పటికీ టాప్ 5 ప్లేస్లో కొనసాగుతుంది.
6) పుష్ప పుష్ప పుష్ప పుష్ప :
అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ కి రెండో భాగంగా రూపొందుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2) నుండి మొదటి లిరికల్ సాంగ్ గా రిలీజ్ అయిన ఈ ‘ పుష్ప పుష్ప పుష్ప పుష్ప ‘ పాట 24 గంటల్లో 10.38 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టి టాప్ 6 ప్లేస్ ని దక్కించుకుంది.
7) లాల భీమ్లా :
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – రానా (Rana) కాంబినేషన్లో రూపొందిన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా 4వ లిరికల్ సాంగ్ గా రిలీజ్ అయిన ఈ లిరికల్ సాంగ్ 24 గంటల్లో 10.20 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టి టాప్ 7 ప్లేస్ లో కొనసాగుతుంది.
8) సాన కష్టం :
చిరంజీవి (Chiranjeevi) – రాంచరణ్ (Ram Charan) – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వచ్చిన ‘ఆచార్య’ (Acharya) సినిమా నుండి 3వ లిరికల్ సాంగ్ గా రిలీజ్ అయిన ఈ ‘సాన కష్టం’ సాంగ్ 24 గంటల్లో 10.16 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది.
9) కుర్చీ మడతపెట్టి :
మహేష్ – త్రివిక్రమ్..ల ‘గుంటూరు కారం’ నుండి 3వ లిరికల్ సాంగ్ గా రిలీజ్ అయిన ఈ ‘కుర్చీ మడతపెట్టి’ లిరికల్ సాంగ్ 24 గంటల్లో 9.52 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది.
10) బాస్ పార్టీ :
మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ (K. S. Ravindra) కాంబినేషన్లో రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ఫస్ట్ సింగిల్ ‘బాస్ పార్టీ’ లిరికల్ సాంగ్ 24 గంటల్లో 9.51M మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టింది.