Chiranjeevi: చిరంజీవి.. ‘అల్లు’డవ్వడం వెనుక చాలా కథ నడిచిందిగా..!

ఇప్పుడు టాలీవుడ్ ను ఏలుతున్న మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు సాధారణ చిరంజీవి అన్న సంగతి తెలిసిందే. అయితే అల్లు రామలింగయ్య గారి అల్లుడైన తర్వాత అతని కెరీర్ టర్న్ అయ్యింది. అయితే అప్పట్లో పెద్దగా ఇమేజ్ లేని చిరంజీవిని అప్పటికే స్టార్ కమెడియన్ స్టేటస్ అనుభవిస్తున్న అల్లు రామలింగయ్య గారు అల్లుడిని చేసుకోవడం వెనుక పెద్ద కథే నడిచింది. చిరంజీవి చెన్నైలో ఉన్నప్పుడు అనుకోకుండా ఓ రోజు తన స్నేహితుడు సత్యనారాయణతో కలిసి అల్లు రామలింగయ్య గారి ఇంటికి వెళ్ళాడు.

సత్యనారాయణ గారికి అల్లు రామలింగయ్య స్వయానా పెదనాన్న. అయితే ఆ టైములో రామలింగయ్య గారు ఇంట్లో లేరు. వాళ్ళ అమ్మాయి సురేఖ మరియు కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళను లోపలికి పిలిచి కూర్చోబెట్టారు. అప్పుడు సురేఖ వీళ్లకు కాఫీ పెట్టారట. తర్వాత సురేఖ మరియు ఆమె కుటుంబ సభ్యులు చిరు గురించి ఆరా తీశారు. అప్పటికే అల్లు రామలింగయ్య గారితో చిరు మూడు సినిమాల్లో కలిసి నటించడం పైగా సత్యనారాయణ కి కూడా దగ్గర మనిషి కావడంతో చిరు గురించి ఎంక్వయిరీ చేశారు అల్లు రామలింగయ్య గారు.

నిజానికి సురేఖ గారిని ఇండస్ట్రీలో వాళ్ళకి ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదట. కానీ సత్యనారాయణ అలాగే రామలింగయ్య గారి సన్నిహితుడు అయిన జయకృష్ణ .. చిరు గురించి మంచిగా చెప్పడంతో ఇండస్ట్రీలో ఉన్న మరికొంత మందిని ఆరాతీసి పెళ్లి ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక పెళ్ళై సురేఖ గారిని అత్తారింటికి పంపే టైంలో చిరు చెయ్యి పట్టుకుని చాలా ఎమోషనల్ అయ్యారట అల్లు రామలింగయ్య గారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus