సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న చిత్రం ‘మురారి’. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మహేష్ బాబు ని కూడా నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. ఆరోజుల్లోనే ఈ చిత్రం పది కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది. అయితే ఈ సినిమా తెరకెక్కముందు కృష్ణ వంశీ గోదావరి జిల్లాలకు వెళ్ళాడట.
ఒక రోజు ఆయన తన స్నేహితుడైనా పున్నేశ్వర రావు (ఆయుర్వేద వైద్యుడు) తో కలిసి గోదావరి నది లో బోట్ ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రశాంతం గా ఉన్న తన సమయంలో ఆయనకీ ఒక డౌట్ వచ్చింది. రాజీవ్ గాంధీ కుటుంబం లో వరుసగా అలా అందరూ చనిపోతున్నారు ఎందుకు అని తన స్నేహితుడు పున్నేశ్వరని అడిగాడు. అప్పుడు ఆయన శాపం వల్ల అలా చనిపోతున్నారు అని చెప్తాడు. ఏమి మాట్లాడుతున్నావ్ అని కృష్ణవంశీ అడగగా అందుకు ఒక ఉదాహరణ చెప్తాడు పున్నేశ్వర రావు.
ఒక ప్రముఖ వ్యక్తి ఒక పాలేరుని చిన్న విషయం లో అనుమానించి చంపేశాడు. అప్పుడు పాలేరు భార్య అతనిని శపించింది. ఆమె శాపానికి తగ్గట్టుగానే, ఆ ప్రముఖ వ్యక్తి పెద్ద కుమారుడు పొలం లో ట్రాక్టర్ దున్నుతూ, అది తిరగబడిపోయి చనిపోయాడు. ఆ తర్వాత అతని కర్మకాండ జరిపించడానికి వెళ్లిన రెండవ కుమారుడు , రైల్వే లైన్ క్రాస్ చేస్తుండగా ట్రైన్ గుద్దేయడం తో చనిపోయాడు’ అని చెప్తాడు. ఇదంతా విన్న కృష్ణ వంశీ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.
ఇది ఇలా ఉండగా కృష్ణ వంశీ ని డైరెక్టర్ గా పెట్టి , మహేష్ బాబు (Mahesh Babu) తో ఒక సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాత రామలింగేశ్వర రావు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాడు. మహేష్ బాబు తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తియ్యాలనుకొని ఒక లైన్ ని రాసుకున్నాడు కృష్ణ వంశీ. ఎప్పుడైతే తన స్నేహితుడి దగ్గర నుండి ఈ శాపాలు కథ విన్నాడో,దీనిని మురారి కథకి లింక్ చేస్తే ఎలా ఉంటుంది అని అలోచించి, శాపం కారణం గా కుటుంబం లో ఒక్కొక్కరిగా చనిపోతారు అనే లైన్ మీద కథ ని డెవలప్ చేసి నిర్మాత రామలింగేశ్వర రావు కి ఫోన్ చేసి.
ఈ కథని మనం మహేష్ బాబు తో చేస్తున్నాం అని డేట్స్ తీసుకోండి అని చెప్పాడట. అలా ఈ కథని వినగానే అటు మహేష్ బాబు మరియు కృష్ణ ఇద్దరు మెచ్చుకొని వెంటనే ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అలా రాజీవ్ గాంధీ కుటుంబ మరణాల నుండి మొదలైన ఈ ఆలోచన చివరికి కార్యరూపం దాల్చి మురారి చిత్ర రూపం లో సెన్సషనల్ హిట్ అయ్యింది.