Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యే సీన్ ఉందా ? తెర వెనుక ఏం జరుగుతోందంటే.?

బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలేకి ముస్తాబవుతోంది. ఈసారి విన్నర్ కి ప్రైజ్ మనీ 50 లక్షలు, జాస్ అలూకాస్ వారి గిఫిట్ 15లక్షలు, బ్రీజా కార్ 10 లక్షలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ సీజన్ కి విన్నర్ ఎవరు అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. రేస్ లో ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు. రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్, అలాగే శివాజీ ఇంకా అమర్ దీప్ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులోనే విన్నర్ డిసైడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచీ చూసినట్లయితే, హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు పల్లవి ప్రశాంత్.

చాలామంది హౌస్ లో తొక్కేయాలని చూసినా పైకి లేచి నిలబడ్డాడు. అమర్ దీప్ – రతిక మొదట్లో చాలామాటలు అన్నారు. ఆ తర్వాత సీరియల్ బ్యాచ్ టార్గెట్ కూడా చేసింది. అయినా కూడా తట్టుకుని నిలబడ్డాడు. శివాజీ అండతో, సలహాలతో తన భావోద్వేగాలని కంట్రోల్ చేసుకున్నాడు. సమయం వచ్చినపుడు మాత్రమే టాస్క్ లలో తన సత్తాని చూపించాడు. ముఖ్యంగా కలర్ పజిల్ టాస్క్ ని సెకన్స్ లో ఫినిష్ చేసి ప్రేక్షకులు అందరూ శభాష్ అనిపించేలా ఆడాడు. దీంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోయింది.

అందర్నీ అడుక్కుని బిగ్ బాస్ హౌస్ కి వచ్చినా కూడా, ఇప్పుడు ఎవరి దయా లేకుండా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ని వేసుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ఆటని చూసిన వాళ్లు అందరూ ఓట్లు వేయడం ప్రారంభించారు. దీంతో అన్ అఫీషియల్ పోలింగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. దాదాపుగా 40 పర్సెంట్ ఓటింగ్ ని ఒక్కడే కైవసం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అసలు పల్లవి ప్రశాంత్ కి అఫీషియల్ ఓటింగ్ అనేది జరుగుతోందా లేదా అనేది సందేహంగా మారింది. అఫీషియల్ పోలింగ్ లో ఏ పొజీషన్ లో ఉన్నాడో తెలియడం లేదని ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు.

ఎందుకంటే, మొదటి నుంచీ సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేస్తూ వచ్చిన (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ ఈసారి పల్లవి ప్రశాంత్ ని తొక్కేస్తాడా ? లేదా కప్ ఇచ్చి పంపింస్తాడా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. బిగ్ బాస్ స్టార్టింగ్ లో చూసినట్లయితే పల్లవి ప్రశాంత్ కి అస్సలు గేమ్ ఆడే ఛాన్స్ రాలేదు. దీంతో కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చి బాగా ఏడ్చాడు. దీంతో తర్వాత టాస్క్ లలో ఆడే అవకాశం వచ్చింది.

మొదటి మూడు వారాలు రతికతో పులిహోర కలిపే ప్రయత్నాలు చేశాడు. ఇద్దరి మద్యలో లవ్ ట్రాక్ ఊపందకుందని సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఆ తర్వాత రతిక ఎదురు తిరిగింది. పల్లవి ప్రశాంత్ ని నానా మాటలు అన్నది. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహించారు. రతికని ఎలిమినేట్ చేశారు. మళ్లీ బిగ్ బాస్ ఈసారి కూడా రతికని రీ ఎంట్రీ అంటూ పల్లవిపై టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.

కానీ, వర్కౌట్ అవ్వలేదు. ఇక రతిక వచ్చిన కొన్ని రోజులు పల్లవి ప్రశాంత్ డల్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ గేమ్ లో పుంజుకున్నాడు. ఎప్పటికప్పుడు హౌస్ మేట్స్ టార్గెట్ చేద్దామని చూసినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. మరి ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ ట్రోఫీని , క్యాష్ ప్రైజ్ ని పల్లవి ప్రశాంత్ కి ఇస్తారా ? లేదా తొక్కేస్తారా అనేది చూడాలి. అదీ మేటర్.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus