నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15న తెలుగు ప్రేక్షకులను వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆయన లేరనే మాట అబద్ధం అయితే బాగుండు అనుకుంటున్నారంతా.. ఆయన కుటంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరీ ముఖ్యంగా మహేష్ బాబు బాధ అయితే వర్ణనాతీతం.. ఇదే ఏడాది అన్నయ్య, అమ్మ, నాన్నలను కోల్పోయాడు. నవంబర్ 21న తండ్రి అస్థికలను విజయవాడ కృష్ణానదిలో నిమజ్జనం చేశారు మహేష్. హాస్పిటల్లో జాయిన్ అయినప్పటినుండి సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు, ఫ్యామిలీ గురించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
తెలుగులో తొలి ఫుల్ స్కోప్ సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమా, తొలి 70 ఎంఎం, ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సినిమాలు కృష్ణ నటించిన సినిమాలే కావడం, ఆయన పరిచయం చేసిన జానర్లే కావడం గమనార్హం. సాహసానికి, ప్రయోగాలకి మారుపేరుగా నిలిచిన కృష్ణ గారిని డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని ఎందుకంటారో తెలియజేయడానికి ఉదాహరణగా నిలిచిన ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో కృష్ణ, అమరజీవి పొట్టి శ్రీరాములుకి మద్దతుగా నిలవడం అనేది అప్పట్లో సెన్సేషన్ అయ్యింది.
రాజకీయాల జోలికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని తెలుగు సినీ పరిశ్రమ అంతా భయపడుతూ ఉంటే.. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది అన్నట్టు సూపర్ స్టార్ ధైర్యంగా వెళ్లి.. మద్రాసులో.. పొట్టి శ్రీరాములుకి మద్దతు తెలియజేస్తూ ఒకరోజు నిరాహార దీక్షలో కూర్చున్నారు. కృష్ణ చేసిన ఈ పనికి పరిశ్రమ అంతా ఆశ్చర్యపోయింది. అందుకే ఆయణ్ణి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, ఆంధ్ర జేమ్స్ బాండ్ అంటారు.
అదే సమయంలో ‘ముల్కీ నిబంధనల మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్ర ప్రజల జీవితాలను దెబ్బ తీసింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అందరూ పోరాటంలో పాల్గొంటున్నారు. ప్రజలలో నేనూ ఒక భాగమే కనుక ఉద్యమంలో నాకూ భాగముంది. ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేసుకుంటున్నాను.. ఈ ఉద్యమం విజయవంతమై తీరుతుంది’ అంటూ అప్పట్లో పత్రికల ద్వారా ఆంధ్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు సూపర్ స్టార్ కృష్ణ..
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!