నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ లెజెండ్.. సినిమా కోసం ఆయన చేసిన సాహసాలు, ప్రయోగాలు ఓ చరిత్ర.. తెలుగులో తొలి ఫుల్ స్కోప్ సినిమా, తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమా, తొలి 70 ఎం.ఎం, ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ వంటి పలు కొత్త జానర్‌లను పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్‌ది.. అందుకే ఆయణ్ణి సాహసానికి మారుపేరుగా చెప్తారు..తొలి చిత్రం ‘తేనె మనసులు’ కి కృష్ణని హీరోగా సెలెక్ట్ చేసింది ఎవరో తెలుసా?..
సాధారణంగా దర్శక, నిర్మాతల పేర్లు చెప్తుంటారు కానీ.. వారితో పాటు అప్పటికే అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు వెలుగుతున్న అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణను ఫిక్స్ చేశారు.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. 5 దశాబ్దాల నట జీవితంలో 350కి పైగా చిత్రాల్లో నటించి, తెలుగు నటుల్లో అత్యధిక చిత్రాలు చేసిన కథానాయకులుగా ఎదగడానికి మొట్టమొదట కృష్ణ ఫొటోను ‘తేనె మనసులు’ మూవీ హీరో సెలక్షన్ టీమ్‌లో ఉన్న నటసామ్రాట్ నాగేశ్వర రావు ఎంపిక చేయడం విశేషం.. అప్పటి అరుదైన, అపురూపమైన చిత్రం నెట్టింట వైరల్‌గా మారింది..