ఈమధ్య కాలం లో మన అందరి హృదయాలను కలిచివేసింది సంఘటన ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం. 16 ఏళ్ళ నిండిన ఈ చిన్నారి మానసిక ఒత్తిడిని తట్టుకోలేక క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం యావత్తు సినీ పరిశ్రమని శోకసంద్రం లోకి నెట్టేసింది. చనిపోయే ముందు అందరిని మిస్ అవుతున్నాను, నా తల్లి దండ్రులు ఇక నుండి నేను లేకుండానే బ్రతకాలి అంటూ ఎమోషనల్ రాసిన లేఖ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
అలాగే విజయ్ ఆంటోనీ (Vijay Antony) నా కూతురు డబ్బు , ద్వేషం , ప్రేమ,దురాశ వీటి అన్నిటికి దూరం గా ఉండే లోకానికి ప్రయాణం అయ్యింది. నేను కూడా ఆమెతోనే చనిపోయాను, ఇప్పుడు తనతోనే ఉన్నాను, ఇక నుండి నేను ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా నా కూతురి పేరు మీదనే చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా పోలీసులు మీరా ఎందుకు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అనే దానిపై దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఆమె మొబైల్ ని తీసుకొని పరిశీలిస్తున్నారు. ఆ మొబైల్ లో మీరా ఆదుకునే గేమ్ యాప్స్, అలా తన స్నేహితులతో చేసిన వాట్సాప్ చాట్స్ వంటివి ఉన్నాయి. కానీ గత నెల రోజుల నుండి మీరా ఫోన్ కి గుర్తు తెలియని ఒక నెంబర్ నుండి తరచూ ఫోన్లు రోజుకి రెండు సార్లు వచ్చాయి అన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
అంతే కాకుండా కొన్ని వీడియోస్ కూడా ఆమె ఫోన్ లో లభ్యం అయ్యిందంటూ కోలీవుడ్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. అంటే ఎవరైనా మీరా ని బెదిరించారా?, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు టాక్. దీనికి సంబంధించిన అధికారిక స్పష్టత పోలీసుల నుండి వెలువడాల్సి ఉంది.