Kalki Teaser: కల్కి టీజర్ నిడివి లెక్కలివే.. ఆ రేంజ్ లో ఉండబోతుందా?

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా మార్చి నెల మూడవ వారంలో ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. 83 సెకన్ల నిడివితో మేకర్స్ ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగుతో పాటు మొత్తం 22 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్ అద్భుతం అనేలా ఉండబోతున్నాయని ప్రతి సీన్ ప్రత్యేకంగా ఉండేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ ఊహలకు అందని విధంగా ఉంటుందని భోగట్టా. ఈ సినిమాలో ప్రభాస్ డ్యాన్స్ కూడా చూడొచ్చని మాస్, క్లాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఈ సినిమాను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ అని హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని భోగట్టా.

కల్కి టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరగగా టీజర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. 800 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. కల్కి అవతారం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. కల్కి సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని భోగట్టా.

ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. కల్కి సినిమాలో అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దీపికా పదుకొనే తెలుగులో మరింత బిజీ కావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. (Kalki) కల్కి 2898 ఏడీ ఇతర భాషల్లో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus