చిక్కులు తెచ్చి పెట్టిన సమంత చేసిన చిన్నపొరబాటు

విల్లు నుంచి వచ్చిన బాణం.. నోటి నుంచి వచ్చిన మాట.. వెనక్కి తీసుకోలేము. అది అందరికీ తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో చేసిన కామెంట్.. అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోలేము అనేది తాజాగా అందరికీ తెలిసివస్తోంది. ఈ విషయం సమంతకి బాగా అర్ధమయింది. ఎందుకో వివరాల్లోకి వెళితే… టీడీపీ నేత, నటుడు నందమూరి హరికృష్ణ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని తెలుసుకున్న వెంటనే తన బాధని సమంత ట్వీట్ రూపంలో వెల్లడించింది. వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసారు. “హరికృష్ణ మరణం నన్ను షాక్ కి గురిచేసింది. వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేసింది.

ఇందులో ఆమె ఉద్దేశం మంచిదే అయినప్పటికీ పెద్దవారిని కనీసం గౌరవించకపోవడం నందమూరి అభిమానులకే కాదు… నెటిజనులు కోపం తెచ్చింది. “అక్కినేని ఫ్యామిలీ కోడలు..ఆ మాత్రం గౌరవం తెలియదా.. పెద్దవాళ్లను గౌరవించడం నేర్చుకో” అంటూ అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో తన పొరబాటు తెలుసుకున్న సమంత ఆ ట్వీట్ ని తొలగించి కొత్తగా హరికృష్ణ గారు అంటూ ట్వీట్ చేశారు. అయినా ఆమెను విమర్శించడం ఆపలేదు. పాత ట్వీట్ ని స్క్రీన్ షాట్ తీసి మరీ పోస్ట్ చేస్తున్నారు. పొరబాటుని సరిదిద్దుకున్నప్పటికీ విమర్శలు వస్తుండడం ఆమెకు తలనొప్పిగా మారింది. ఇక నుంచి ట్వీట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పాఠం నేర్చుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus