ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్‌కు పురస్కారాలు కొత్త కాదు. ఏటా ఏదో ఒక గొప్ప అవార్డు ఆయన ఇంటికి వస్తూనే ఉంటుంది. అయితే అత్యంత పురాతన చలనచిత్రోత్సవం నుండి ఒక పురస్కారం అందుకోవడం అంటే గొప్పే కదా. ఇప్పుడు అలాంటి పురస్కారమే దక్కించుకున్నారు రెహమాన్. ఆఫ్రికాలోని కైరో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో రెహమాన్‌కు పురస్కారం దక్కింది. ఇటీవల జరిగిన 43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో (సిఫ్) రెహమాన్‌ను ప్రత్యేకంగా సన్మానించారు.
సంగీత, సినిమా రంగంలో రెహమాన్ చేసిన కృషికి గానూ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన్ను సత్కరించింది. సిఫ్ ప్రెసిడెంట్ మహమ్మద్ హెఫ్జీ చేతుల మీదుగా రెహమాన్ గౌరవ ట్రోఫీని అందుకున్నారు. ఈ విషయాన్ని రెహమాన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పురస్కారానికి సంబంధించిన ఫొటోలను షేర్‌చేశారు. స్పెషల్ ట్రిబ్యూట్ సర్టిఫికేట్ పేరుతో ఈ పురస్కారాన్ని రెహమాన్‌కు అందించారు. ఈజిప్టులోని కైరో ఒపెరా హౌస్‌లో నవంబర్ 28న ప్రారంభమైన సిఫ్ చిత్రోత్సవం డిసెంబర్ 5తో ముగుస్తుంది.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?