‘ప్రాజెక్ట్ కె’గా శాన్ డియాగా కామికాన్‌కి వెళ్లి ‘కల్కి 2898 AD’గా మారిపోయింది ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే అంశంగా మారింది. అయితే ఈ సినిమా గురించి మరికొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు రాజమౌళి రెయిజ్ చేయగా… మరికొన్ని అభిమానులు సోషల్ మీడియాలో అడుగుతున్నారు. అయితే రాజమౌళి అడిగిన ప్రశ్నకు ఆన్సర్ దాదాపు దొరికేసింది అని అంటున్నారు. అదేనండీ రిలీజ్ డేట్.
‘కల్కి 2898 AD’ (Kalki) ఫస్ట్ గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కలర్, ఆ సెటప్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. తొలుత ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకొస్తారని చెప్పారు. కానీ టీజరలో రిలీజ్ డేట్ చెప్పలేదు. దీంతో ఈ ప్రశ్న ప్రముఖంగా కనిపిస్తోంది, వినిపిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం వైజయంతి మూవీస్‌కు సంబంధించిన స్పెషల్ డేట్ అని అంటున్నారు. ఇంత పెద్ద సినిమాను ఎలాంటి పోటీ లేని సమయంలో రిలీజ్ చేయాలని అనుకోవడం కూడా ఈ డేట్‌కు కారణం అని చెబుతున్నారు.
వైజయంతి మూవీస్‌కు స్పెషల్ డేట్ అంటే… మే 9. ఆ బ్యానర్ నుండి వచ్చిన రెండు భారీ విజయాలు ఆ డేట్ నాడు రిలీజ్ అయిన సినిమాలే. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తారని… మొదటి పార్ట్‌ను మే 9న విడుదలచేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మే 9న విడుదలైన ‘మహానటి’ బ్లాక్ బస్టర్ అందించింది. అంతకుముందు చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కూడా అదే రోజు రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో ‘కల్కి’ని మే 9న విడుదల చేయాలని అనుకుంటున్నారట.
ఈ నేపథ్యంలో త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తారు అని అంటున్నారు. అయితే ఇప్పుడు కాదని, ప్రభాస్ పుట్టిన రోజు అయిన అక్టోబరు 23న కానీ, ఆగస్టు 15న కానీ చెబుతారు అంటున్నారు. ఇక ‘కల్కి’లో ప్రభాస్ సరసన దీపిక పడుకొణె నటిస్తుండగా, విలన్‌గా కమల్ హాసన్ నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ మరో ముఖ్య పాత్రధారి.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!