మొన్నామధ్య నాని ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘ఏ మనిషైనా గొప్పోడు, మంచోడు అని చెప్పించుకోవాలంటే చనిపోవాలి… చనిపోతేనే మంచోడు, గొప్పోడు’ అని..! దీనికి బెస్ట్ ఎగ్జామ్పుల్ గా తారకరత్నని చెప్పుకోవచ్చు. తారకరత్న సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు సక్సెస్ కాలేకపోయాడు. తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించాడు కానీ.. అవి వచ్చి వెళ్లినట్టు కూడా జనాలకు తెలీదు. ఇతను బ్రతికున్నన్నాళ్ళు బాలయ్య తప్ప ఏ ఒక్క సెలబ్రిటీ ఇతని గురించి మాట్లాడింది.
పోనీ ఇతను తీసిన సినిమాల గురించి స్పందించింది లేదు. కానీ ఇప్పుడు మాత్రం తారకరత్న అంత గొప్ప, ఇంత గొప్ప… నిస్వార్ధ జీవి అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్, అలాగే అశ్వినీదత్ వంటి సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ తారకరత్న చాలా గొప్పోడు అని చెబుతూనే తమ సినిమాల్లో స్పెషల్ రోల్స్ కూడా డిజైన్ చేయించినట్టు చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి.. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 108వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో తారకరత్న కోసం ఓ స్పెషల్ రోల్ డిజైన్ చేయమని బాలయ్య.. అనిల్ కు ఫోన్ చేసి చెప్పారట. కానీ ఇంతలోనే ఇలా జరగడం విషాదకరం అంటూ అనిల్ చెప్పుకొచ్చాడు. ఇక అశ్వినీదత్ అయితే తన బ్యానర్లోనే ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ చిత్రంతో తారకరత్నని లాంచ్ చేశామని.. అతని నవ్వు అంటే చాలా ఇష్టం అని తెలియజేశాడు. అంతేకాదు ప్రభాస్ తో నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ లో తారకరత్న కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ స్పెషల్ రోల్ డిజైన్ చూశాడని చెప్పుకొచ్చాడు.
అనిల్, అశ్వినీదత్ చెప్పింది నిజమో కాదో వారికే తెలియాలి.. ఒకవేళ నిజమే అయితే తారకరత్న బ్రతికున్నప్పుడే ఈ మంచి విషయాలు చెప్పొచ్చు కదా. తారకరత్న పోయాక చెబితే నందమూరి అభిమానులు బాధపడటం.. అనిల్, అశ్వినీదత్ లు హైలెట్ అవ్వడం తప్ప ఇంకేం ఉపయోగం అంటూ అంతా భావిస్తున్నారు.