కాలేజీ స్టూడెంట్ గా సినిమాల్లో అడుగు పెట్టి కమర్షియల్ హీరో స్థాయికి ఎదిగిన కుర్రోడు నిఖిల్. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఇతను పక్కా హైదరాబాదీ చురుకుదనంతో యువతను ఆకర్షించాడు. సినిమా సినిమాకు నటనను మెరుగు పరుచుకుంటూ నేటి యువ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. చిన్న నిర్మాతలకు బడా హీరోగా ఎదిగాడు. అమ్మాయిలలో మంచి క్రేజ్ సంపాదించుకున్ననిఖిల్ పుట్టిన రోజు (జూన్1) సందర్భంగా.. అతని గురించి కొన్ని సినీ సంగతులు..
నిజ జీవితంలో నిఖిల్ ఎలా ఉంటాడో అదే విధమైన పాత్రను “హైదరాబాద్ నవాబ్స్” సినిమాలో చేసాడు. సరదాగా నవ్వించి శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ చిత్రంలో చాన్స్ కొట్టేసాడు. ఇదే అతని లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఈ మూవీలో లెక్చరర్ వెంటపడే రాజేష్ గా అలరించాడు. నలుగురి హీరోల్లో ఒకడిగా నటించినా ప్రత్యేక గుర్తింపును సాధించాడు. తర్వాత అంకిత్, పల్లవి & ఫ్రెండ్స్ లోనూ స్నేహితుడిగా నటించి పక్కింటి కుర్రోడిలా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
సోలోగా ..యువత సినిమాతో నిఖిల్ సోలో హీరోగా మారాడు. ఎనర్జిక్ నటనతో విజయం అందుకున్నాడు. తర్వాత కలవర్ కింగ్, ఓం శాంతి, ఆలస్యం అమృతం సినిమాలు లోబడ్జట్ తో రెడీ అయ్యి తక్కువ లాభాలతో నిర్మాతని సేఫ్ జోన్లో పడేశాయి. దీంతో నిఖిల్ నిర్మాతలకు ఫ్రెండ్ గా మారాడు. ఆ తర్వాత వచ్చిన “వీడు తేడా” సినిమా యాభై రోజులు ఆడింది. సోలోగా సినిమాను నడిపించగలను అని నిఖిల్ ఈ చిత్రంతో నిరూపించుకున్నాడు. తర్వాత “డిస్కో” మూవీలో స్టైల్ గా కనిపించి కేక పుట్టించాడు. ఈ సమయానికి కథల ఎంపికలో నిఖిల్ కి అవగాహన ఏర్పడింది.
2013 హిట్ ఇయర్నిఖిల్ ను స్టార్ ను చేసిన ఏడాదిగా 2013ని చెప్పవచ్చు. ఈ సంవత్సరం సుధీర్ వర్మ దర్శకత్వంలో చేసిన “స్వామీ రారా” సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో టాలీవుడ్ సినీ వర్గాల చూపు నిఖిల్ పై పడింది. తర్వాత కార్తికేయగా వెండితెర పై కనిపించి విజయం అందుకున్నాడు. ఈ రెండు సినిమాలో స్వాతి రెడ్డి(కలర్స్ స్వాతి) హీరోయిన్ కావడం విశేషం. తర్వాత సూర్య వర్సెస్ సూర్య తో హ్యాట్రిక్ కొట్టాడు. దాదాపు సినిమా మొత్తం రాత్రి వేళల్లో జరిగినా.. ప్రేమను అద్భుతంగా పలికించి నిఖిల్ మెప్పించాడు. ఇటువంటి కథను ఎంచుకోవడంలోనే నిఖిల్ ప్రతిభ దాగుంది. ఆ తర్వాత శంకరా భరణం కొంత నిరాశ పరిచినా .. అందులోమల్టీ మిలీనియర్ కొడుకుగా నిఖిల్ నటనకు వంద మార్కులు పడ్డాయి.
ఎక్కడికి పోతావు చిన్నవాడ ..ఈ ఏడాది నిఖిల్ హీరోగా టైగర్ సినిమా దర్శకుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
“ఎక్కడికి పోతావు చిన్నవాడ ..”. దీనికి “నీవు ప్రేమ నుంచి తప్పించుకోలేవు” అనే కాప్షన్ కూడా ఉంది. టైటిల్లో కొత్తదనంతో పాటు.. నిఖిల్ పక్కన హెబా పటేల్, నందిత హీరోయిన్లుగా నటిస్తుండడం ఈ చిత్రం పై అంచనాలను పెంచేస్తోంది. ఏఎన్ఆర్ సినిమా ఆత్మబలంలోని పాటను పేరుగా పెట్టుకున్నఈ సినిమా నిఖిల్ కు మరో సూపర్ హిట్ ను ఇస్తుంది.