Aa Okkati Adakku OTT: అల్లరి నరేశ్‌ కొత్త సినిమా ఓటీటీ డేట్‌ ఫిక్స్‌… ఎందులో అంటే?

నరేశ్‌ (Allari Naresh)  అంటే ఒకప్పుడు కామెడీకి కొత్త కింగ్‌. నట కిరీటి తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలు చేస్తున్నాడు అంటూ అంతా మెచ్చేసుకున్నారు. ఈ క్రమంలో బోర్‌ కొట్టేసి ఆయన సినిమాలు చూడటం తగ్గించేశారు జనాలు. దీంతో ఆయన ‘నాంది’, ‘ఉగ్రం’ (Ugram) , ‘మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam) అంటూ సీరియస్‌ మోడ్‌లోకి వచ్చేశారు. అక్కడా తేడా కొట్టడంతో ఇప్పుడు మళ్లీ కామెడీ జోన్‌లోకి వచ్చేశారు. అలా చేసిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’(Aa Okkati Adakku).

ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రాకకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మ‌ల్లి అంకం దర్శకుడిగా పరిచయమై తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ప్రయత్నమే అనిపించుకుంది. మే 3న విడుదలైన ఈ సినిమా ఓటీటీ పార్టనర్‌, డేట్ ఫిక్స్‌ అయ్యాయట. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీలో ఈ సినిమా ఓటీటీ జర్నీ స్టార్ట్‌ అవుతుందట. మే 31 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్‌ ప్రారంభమవుతుంది అంటున్నారు.

అయితే ఈ సినిమా రెండు ఓటీటీల్లో ఒకేసారి రిలీజవుతుందా? లేదా కొన్ని రోజుల గ్యాప్ తర్వాత వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమా కథ సంగతి చూస్తే.. గణ అలియాస్‌ గణపతి (అల్లరి నరేష్‌) సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో పని చేస్తుంటాడు. తన చేతుల మీదుగా వివాహాలు జరిపించిన అతనికి 30 దాటినా పెళ్లి కాదు. తన తమ్ముడు (రవికృష్ణ)కు మేనమామ కూతురు (జెమీ లివర్‌)ను ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లంతా గణ కోసం ఎన్నో సంబంధాలు చూస్తుంటారు.

ఆఖరి ప్రయత్నంగా హ్యాపీ మ్యాట్రిమోనీలో ప్లాటినం సభ్యుడిగా చేరతాడు. దాని ద్వారా పరిచయమైన సిద్ధి (ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) )పై మనసు పారేసుకుంటాడు. కాకపోతే ఆమె గణ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. ఆమె ఎందుకు తిరస్కరించింది. అప్పటికే ఆమెను ప్రేమించిన గణ ఏం చేశాడు అనేది సినిమా కథ. ఇందులో సగటు యువకుడి కష్టం సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది.

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus