ఆస్కార్ వద్దు సినిమా ఆడితే చాలు.. ఆడవాళ్లకు దండం అంటున్న శర్వా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోలలో అయితే శర్వానంద్ టాప్ లిస్టు లో ఉన్నాడు అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా అతను సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. డబుల్ హాట్రిక్ డిజాస్టర్స్ నా చూసిన శర్వానంద్ ఇప్పుడు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులలో అయితే పాజిటివ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు.

ఇక సినిమాలో క్యారెక్టర్ పెళ్లి కోసం తాపత్రయపడే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కనిపిస్తున్నాడు. ప్రతి పెళ్లి సంబంధం లో అతనికి అమ్మాయి నచ్చడం వారి అమ్మలకు మాత్రం ఆ అమ్మాయి నచ్చకపవడంతో ఆ సంబంధాలు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఈ సినిమాలో శర్వానంద్ కు ముగ్గురు అమ్మలు ఉంటారని తెలుస్తోంది. ఇక చివరికి శర్వానంద్ కు హీరోయిన్ రష్మీకను ఇష్ట పడడంతో ఆ తరువాత వారి పేరెంట్స్ ను ఎలా ఒప్పించాడు. రష్మీక కూడా శర్వానంద్ తో పెళ్లికి ఒప్పుకుందా లేదా ఆమె పెట్టిన కండిషన్స్ ఏమిటి అనే అంశాలు ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి.

ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర ప్యూర్ ఫ్యామిలీ పర్సన్ లాగా చాలా ఎంటర్టైన్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక తనకు ఆస్కార్ వద్దు సినిమా ఆడితే చాలు అనే డైలాగ్ కూడా ప్రస్తుతం అతని కెరీర్ కు దగ్గరగా ఉండడం విశేషం. ఇక ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

సినిమాలో కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులు ముఖ్యమైమ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక వెన్నెల కిషోర్, రవి శంకర్ ,సత్య, ప్రదీప్ రావత్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక సినిమాను ఫైనల్ గా మార్చి 4వ తేదీన విడుదల చేయబోతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ లో నిర్మిస్తున్నారు.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus