Aadikeshava OTT: వైష్ణవ్‌ తేజ్‌ – శ్రీలీల సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే!

సినిమా హిట్‌ కొడితే ఓటీటీల్లోకి రావడానికి కొంత ఆలోచించాలేమో… తేడా కొట్టిందో వెంటనే వచ్చేయాలి. ప్రస్తుతం టాలీవుడ్‌లో నిర్మాతలు ఇలానే ఆలోచిస్తున్నారు. ఒక విధంగా ఇది మంచిది కూడా. కొందరు రెండు వారాలకు వచ్చేస్తుంటే ఇంకొందరు నాలుగు వారాలకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండో స్టైల్‌లో వచ్చేస్తున్న సినిమా ‘ఆదికేశవ’. మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, స్టార్‌ హీరోయిన్‌ శ్రీలీల నటించిన ఈ సినిమాకు ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.

‘ఆదికేశవ’ (Aadikeshava) సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన విషయం తెలిసిందే. రొడ్డ కొట్టుడు మాస్‌ ఎలిమెంట్స్‌తో, కొత్తదనం లేకుండా సోసోగా సాగిపోయిందీ సినిమా. ఈ క్రమంలో వారానికే చుట్టేసింది. అయితే ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్‌ తేడీని అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 22, 2023 నుండి సినిమా స్ట్రీమ్‌ అవుతుంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కథ సంగతి చూస్తే… త‌ల్లిచాటు బిడ్డ‌లా గారాబంగా పెరిగిన యువ‌కుడు బాలు (వైష్ణ‌వ్‌ తేజ్‌) స్నేహితుడితో క‌లిసి బ‌లాదూర్‌ తిరుగుతుంటాడు. అయితే ముందు అన్యాయం జ‌రుగుతోందంటే, ఎంత‌టివాళ్ల‌నైనా ఎదిరించేస్తుంటాడు. అయితే త‌ల్లిదండ్రుల బ‌ల‌వంతంతో ఓ కాస్మొటిక్ కంపెనీలో ఉద్యోగంలో చేర‌తాడు.

ఇంట‌ర్వ్యూలోనే కంపెనీ సీఈవో చిత్రావ‌తి (శ్రీలీల‌)కి బాలు బాగా నచ్చేస్తాడు. ఆ త‌ర్వాత ప్రేమ‌లో ప‌డ‌తారు కూడా. ఇంత‌లో రాయ‌ల‌సీమ‌లోని బ్ర‌హ్మ స‌ముద్రం నుండి ఓ పెద్దాయ‌న వ‌చ్చి బాలుకు అస‌లైన కుటుంబం వేరే ఉంద‌ని, త‌న అస‌లు పేరు రుద్ర కాళేశ్వ‌ర్‌ రెడ్డి అని చెప్పి… త‌న‌తో తీసుకెళ‌తాడు. దీంతో ట్విస్ట్‌ వస్తుంది. ఇక బాలు ఎవ‌రు. అత‌ని కుటుంబం క‌థేమిటి. బ‌్ర‌హ్మ స‌ముద్రంలోని రావ‌ణుడి లాంటి చెంగా రెడ్డి (జోజు జార్జ్‌)కి రుద్ర కాళేశ్వర్‌కి సంబంధం ఏంటి అనేది సినిమా కథ.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus