సూర్య ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడే..!

పాపం సూర్య.. ఈ మధ్య కాలంలో హిట్టు కొట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒకప్పుడు తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా తెలుగులో ఆయన మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. దీనికి కారణం.. వరుసగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడమే అని చెప్పడంలో సందేహం లేదు. 2019 లో సూర్య నుండీ వచ్చిన ‘ఎన్జీకే’ ‘బందోబస్త్’ సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. అయితే ఈ 2020లో కచ్చితంగా హిట్ కొట్టాలని ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో రాబోతున్నాడు. ‘గురు’ ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. ఆ టీజర్ ఎలా ఉందొ ఓ లుక్కేద్దాం రండి..

‘జేబులో ఆరు వేలు పెట్టుకుని.. ఎయిరో ప్లేన్ కంపెనీ పెడతానని ఒకడొస్తే… ఎవడ్రా ఈ విపి గాడు అని.. ఈ లోకం వాడిని చూసి నవ్వింది’.. అంటూ మోహన్ బాబు వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది. ఎయిర్ లైన్ కంపెనీని స్టార్ట్ చెయ్యాలి అనే డ్రీంతో తహతహ లాడే ఓ హీరోకి ఎదురైన పరిస్థితులని ఈ టీజర్ లో చూపించారు. సూర్య ఈ పాత్రలో తన నట విశ్వరూపం చూపించబోతున్నాడని స్పష్టమవుతుంది. ఫ్రస్ట్రేషన్, కోపంతో ఉన్న హీరో లక్షణాల్ని టీజర్ లో చూపించారు. అపర్ణ బాలమురళి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. జివి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అక్కడక్కడా కాస్త ‘గురు’ సినిమా ఛాయలు కనిపించినప్పటికీ.. టీజర్ పర్వాలేదనిపించింది. మరి ఈ చిత్రంతో అయినా సూర్య హిట్టు కొడతాడేమో చూడాలి. ఇక ‘ఆకాశం నీ హద్దురా’ టీజర్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus