రాజమౌళి రిలీజ్ చేసిన ‘ఆకాశవాణి’ టీజర్!

దర్శకధీరుడు రాజమౌళి వద్ద సహాయకుడిగా పని చేసిన అశ్విన్ గంగరాజు ‘ఆకాశవాణి’ అనే సినిమాను రూపొందించాడు. ముందుగా ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మించాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వలన ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఈ సినిమాతో సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను రాజమౌళి రిలీజ్ చేశారు. టీజర్ మొత్తంలో కూడా మనకి ఒక్కటే డైలాగ్ వినిపిస్తుంది.

పీరియాడిక్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అడవుల్లో నివసించే ఓ తెగకి చెందిన ప్రజలు, తమ కట్టుబాట్లకు నమ్మకాలకు విలువనిస్తూ సంతోషంగా జీవిస్తుంటారు. ఆ ఊరికి ఓ రాజు కూడా ఉన్నట్లు టీజర్ లో చూపించారు. అయితే వారి జీవితాల్లో కొన్ని ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నట్లుగా టీజర్ లో కనిపిస్తుంది. చివరిగా టీజర్ లో నటుడు సముద్రఖని ‘ఏదో తప్పు జరుగుతుంది’ అని చెప్పే ఒక్క డైలాగ్ మాత్రమే వినిపించింది.

కొన్ని సన్నివేశాలను చూపిస్తూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు. ఇక సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తుండడం విశేషం. ఇప్పటివరకు రాజమౌళి దగ్గర పని చేసిన సహాయకులు ఎవరూ కూడా దర్శకులుగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కనీసం అశ్విన్ గంగరాజు ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి హిట్ అందుకుంటాడేమో చూడాలి!


ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus