‘ఆర్.ఆర్.ఆర్’ బాలీవుడ్ బిజినెస్ కోసం పెద్ద స్కెచ్ వేసిన రాజమౌళి..ఏకంగా ఆమిర్ తో..!

ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో.. దర్శకుడు రాజమౌళికి ఎవ్వరూ సాటిరారనే చెప్పాలి.అతని సినిమాల్లో కనిపించే హై.. అలాగే వాటి రిజల్ట్ ను బట్టి ఈ విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. అయితే ‘ఇద్దరు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ చెయ్యబోతున్నాడు కదా.! నిజంగా ఇది పెద్ద సాహసమే. ఏ హీరోని తక్కువ చేసినా..తేడా కొట్టేస్తుంది’ అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేసారు. అయితే రాజమౌళి చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడనే చెప్పాలి.రాంచరణ్ టీజర్ కోసం ఎన్టీఆర్ వాయిస్ ను వాడుకుని రోమాలు నిక్కపొడిచేలా చేసాడు.

ఇక ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ టీజర్ కోసం రాంచరణ్ వాయిస్ ను వాడుకుని సమానమైన ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యం అన్నట్టు స్పష్టం చేసాడు. ఇప్పుడు జక్కన్న మరో పెద్ద స్కెచ్ వేసాడట. అదేంటంటే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని హిందీలో మార్కెట్ చేసుకోవడం కోసం ఏకంగా అక్కడి స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ను రంగంలోకి దింపుతున్నట్టు భోగట్టా. ఆల్రెడీ ఈ చిత్రంలో ఆలియాభట్.. అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ కు ఆమిర్ ఖాన్ వాయిస్ ఓవర్ తో పాత్రలను ఇంట్రొడ్యూస్ చెయ్యడానికి రాజమౌళి ప్రయత్నాలు మొదలుపెట్టాడనేది తాజా సమాచారం. ‘ఇది కనుక నిజమైతే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం బాలీవుడ్లోనే రూ.1000కోట్ల గ్రాస్ ను కొల్లగొడుతుందని’ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.చూడాలి మరి వారి నమ్మకం ఎంత బలమైనదో..!

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus