Aamir Khan: లాల్ సింగ్ చద్దా ఎఫెక్ట్.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అమీర్ ఖాన్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆమీర్ ఖాన్ తన సినీ కెరియర్ లో ఏమాత్రం విరామం లేకుండా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడిపారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఈయన తన కుటుంబంతో సరైన సమయం గడప లేకపోయారు. ఇలా సినిమాలపై మక్కువతో కుటుంబానికి దూరమై సినిమాలలో నటిస్తూ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇకపోతే అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి లాల్ సింగ్ చద్దా సినిమా కోసం

ఈయన గత ఎనిమిది సంవత్సరాలుగా కలలు కంటూ మూడు సంవత్సరాలుగా రాత్రి పగలు కష్టపడుతూ ఈ సినిమాని సొంత బ్యానర్ లో భారీ బడ్జెట్ కేటాయించి నిర్మించారు.ఈ విధంగా భారీ బడ్జెట్ చిత్రంగా తన డ్రీమ్ ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా తీవ్ర నిరాశపరిచింది.ఈ సినిమా కారణంగా పెద్ద ఎత్తున నష్టాలు ఏర్పడటమే కాకుండా అమీర్ ఖాన్ లో ఏదో తెలియని అసహనాన్ని సృష్టించింది. ఈ క్రమంలోనే తన డ్రీమ్ ప్రాజెక్టు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ తన ఆశలు ఆశలుగానే ఉండడంతో అమీర్ ఖాన్ సినిమాల పట్ల షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.

ఈయన ఇకపై కొంతకాలం పాటు ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని, ఎలాంటి సినిమాలలోను నటించకూడదని ఫిక్స్ అయ్యారట.ఇలా అమీర్ ఖాన్ పూర్తిగా రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే అమీర్ ఖాన్ తల్లి ఈ మధ్యకాలంలో తీవ్రమైన గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో తన తోడు తల్లికి ఎంతో అవసరం అని భావించిన అమీర్ ఖాన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఇక వరుస సినిమా షూటింగ్లతో ఏమాత్రం విరామం లేకుండా పూర్తిగా తన కుటుంబంతో తను గడపాల్సిన సమయం కూడా గడప లేక పోయానని గ్రహించినటువంటి ఈయన ఈ రెండు సంవత్సరాలు పాటు పూర్తిగా తన ఫ్యామిలీతో కలిసి తన విలువైన సమయాన్ని గడపడానికి ఈయన ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. అందుకే రెండు సంవత్సరాల పాటు ఈయన సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus